Friday, April 24, 2020

బాలనాగమ్మ (1942 చిత్రం) చూసినప్పడు అనుభూతి

ఈ సినిమా కోసం చాలా యేళ్ళు ఎదురుచుశాను. ఇంతచక్కగా తీసిన చిత్రం అనుకోలేదు. దీని ముందు తర్వాత 1959లో తీసిన బాలనాగమ్మ చిత్రం ఏమాత్రం పోటికి రాలేదు. కాంచనమాల, గోవిందరాజులు, మాస్టర్ విశ్వం చాలా బాగా నటించారు. లేదు లేదు వాళ్ళ పాత్రలకి జీవంపోశారు. ఇప్పటివరకు గోవిందరాజులుని సౌమ్యపాత్రలలోనే చూసాను. అతనిలో అంత టాలెంట్ ఉందనుకోలేదు. అతని రూపు, నవ్వు చూసి అక్కడక్కడా నాకే భయంవేసింది. ఇక బలవర్ధిరాజు పాత్రలో చాలా ఆకట్టుకున్నాడు మాస్టర్ విశ్వం. ఎందుకో ఆ కుర్రాడు తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. మాష్టర్ విశ్వం నటన బాగా నచ్చి అతని మీద ఒక వికిపీడియా ఆర్టికల్ కూడా క్రియేట్ చేసాను (https://en.wikipedia.org/wiki/Master_Viswam).
అందుకే జెమినీ స్టూడియో వాళ్లకి ఇదే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అయ్యింది. సుమారు 7-8 నిమిషాలు కట్ అయ్యింది అనుకుంటా.చాకలి తిప్పడు-పులిరాజు ఉదంతం చూడలేకపోయాను. విశ్వంలో ఎన్నెన్నో వింతలు. అన్నిటిని మనం చూడలేము. కొన్ని మన ఇమాజినేషన్‌కి వదిలేయాల్సిందే.
ఇంకా చెప్పాలంటే, సంగీత దర్శకత్వం కూడా చాలాబాగుంది. మాయల మరాఠి నాగమ్మ అపహరణకి జనంగదొర వేషం కట్టేటప్పుదు ఉన్న నేపథ్య వీణనాదం ఎంత బాగుందో. ఈ సినిమా రేలంగి కూడా ఉన్నాడు. రాణి సంగు పాత్రలో పుష్పవల్లి నటన కూడా బాగుంది (ఆమె మాజీ హీరోయిన్ రేఖ తల్లి). టెక్నాలజీ పెద్దగాలేనప్పటికీ అలనాటి నటుల గాత్రం, నటనని హృదయపూర్వకంగా మెచ్చుకోవాలి. పాత సినిమాని బాగుచేసినవారికి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినవారికి ధన్యవాదాలు చెప్పకతప్పదు.

13 comments:

  1. 1942 బాలనాగమ్మ గురించి మీరు వ్రాయడం ( ఎందుకంటే) మీ వయసు చూస్తే 40 ల లొనే వుంది, అశ్చర్యాన్ని, అనందాన్నీ కలిగించింది. మా నాన్న అంటె విశ్వం గారు చాలా కళల్లొ నిష్ణాతుడు.ఒక మనిషిలొ ఇన్ని కళలు ఉంటాయా అని మైకెలొంజిలొ , భానుమతి గార్లను గురించి విన్నప్పుదు అనిపిస్తుంది , కాని ప్రత్యక్షంగా చూసినప్పుడు,వాళ్ళ ఎకైక
    మగ సంతానం ఐన అనుభూతి నాది.నాన్న సింపుల్ జీవితం గడిపారు.సెకన్లలొ పాటకి వరస కట్టేస్తారు. జీవకళ ఉట్టిపడేలా చిత్రాలు వేస్తారు. ఫొటొగ్రఫీ ఆయన హాబీ. హార్మొనియం మీద ఆయన చాలా సుతారంగా వాయుస్తూ, పాటలు పాడుతుంటె భలే గొప్పగా ఉండేది. నాన్న 10 చదివేటప్పుడె ,తాత గారు పోవడంతొ , తన ఇద్దరు చెల్లెళ్ళు,ఒక తమ్ముడు,మా నాయనమ్మ, నాన్న వాళ్ళ నాయనమ్మ, మేనత్త బాధ్యత లు మీద పడ్డాయ్. మొత్తంగా 7 పెళ్ళిళ్ళూ ,తమ్ముడుని ఫొటొ స్టుడియోతొ స్థిరపరచారు. బాయ్ హుడ్ లొ టీచర్ గా మొదలై, పీజీ తెలుగు , హింది, ఆంగ్ల భాషల్లో చేసి ఇంగ్లీష్ లెక్చరర్ గా స్థిరపడ్డారు ఖమ్మంలో. చండిక(భవాని), జీవన్ముక్తి,
    మొదటి భూకైలాస్( ఏ వీ ఎం ), మొదటి బాలనాగమ్మ ( జెమినీ) లలో మంచి పేరే వచ్చింది. అవకాశాలు బోల్డన్ని,గూడవల్లి రామబ్రహ్మం, ఘంటసాల బలరామయ్య గార్ల నుండి మాయాలోకం , ముగ్గురు మరాఠి ల కోసం తలుపు తట్టాయ్. సినిమాల్లోకి పొతె నీ కొడుకు నీక్కాకుండా పొతా డన్న ప్రక్కవారి మాటలు మా తాత బాగా పట్టించుకొన్నారు.
    ఏ రోజూ నాన్న గతం గురించి బాధ పడలేదు. కాలెజిలో, క్లా స్ రూంలో ,వాతవరణాన్ని సరదా గా , ఆహ్లాదం గా వుంచేవారు. అన్నట్లు జరదా కిళ్ళీ వేసుకునేవారు. మా కొసం తన జీవితం ఖర్చు చేసిన ఆయన చివరి మాటలు " నేను మీకేం చెసాన్రా ,అనీ" , నాన్నా ఈ డాక్టర్ల కన్నా మీరు దేవుడి మీద బొల్డన్ని పాటలు పాడారు, బొమ్మలు వేసారు, దేవుడినే ఆయుశ్శు అడగండి అంటె " ఆయనకు తెలియదా " అన్నారు. అహంకారం అని నేననుకొన్నాను. అంకితభావం అని నాకు తరువాత అర్ధమయ్యంది .
    జీవన్ముక్తి పాటలు, ఆయన 40 ఏళ్ళకు పైగా రేడియో లో పాడిన లలిత గీతాలు, వేసిన బొమ్మలు నా వద్ద వున్నయ్. మీ మైల్ ఐ డి /ఫొన్ నంబర్ పంపగలరు . మరో మారు ధన్యవాదాలు. --శ్రీనివాసరావు వి, ఖమ్మం ,9441481014

    ReplyDelete
    Replies
    1. //1942 బాలనాగమ్మ గురించి మీరు వ్రాయడం ( ఎందుకంటే) మీ వయసు చూస్తే 40 ల లొనే వుంది, అశ్చర్యాన్ని, అనందాన్నీ కలిగించింది. మా నాన్న అంటె విశ్వం గారు చాలా కళల్లొ నిష్ణాతుడు.ఒక మనిషిలొ ఇన్ని కళలు ఉంటాయా అని మైకెలొంజిలొ , భానుమతి గార్లను గురించి విన్నప్పుదు అనిపిస్తుంది , కాని ప్రత్యక్షంగా చూసినప్పుడు,వాళ్ళ ఎకైక మగ సంతానం ఐన అనుభూతి నాది.//

      నమస్తే అండీ. హహా నా వయసు 30లలో ఉంది లెండి. మీ కామెంట్ విని చాలా సంతోషం అనిపించింది.
      బాలనాగమ్మ సినిమా చూసేటప్పుడు నా దృష్టి మొత్తం మీద దాన్ని వాళ్ళు ఏ విధంగా తెరకెక్కించారు అన్నదాని మీద, గోవిందరాజుల సుబ్బారావు, కాంచనమాల వారిద్దరి యొక్క నటన మీద మాత్రమే focus ఉంది. కాని బాలవర్ధి రాజు నటనిని చూసి ఆశ్చర్యం, ఆనందం అనిపించింది. నిజం చెప్పాలంటే మిగిలిన ముఖ్య పాత్రల్లో అందరూ పెద్దవాళ్ళు. ఒక బాలవర్ధిరాజు ఒక్కటే 12 ఏళ్ళ కుర్రాడు పాత్ర. బాలవర్ధిరాజు తంబళ్ళ పెద్దమ్మ దగ్గరికి పోయినప్పుడు తాను మనవడిని అని దగ్గరయ్యే సన్నివేశంలో అతని నటన చూసి చాలా ముచ్చటేసింది. "అంత చిన్న వయసు కలిగిన కుర్రాడు ఆకట్టుకునేలా మాట్లాడగలడా", అనిపించింది. ఇక చినిమా చివరివరుకు ఆ పాత్రమీదనే ఉంది నా దృష్టి. ఎవరు ఈ విశ్వం అని ఇంటర్నెట్‌లో చూస్తే పట్టుమని 5 సినిమాలు కూడా చేయలేదు. దాంతో నాకు ఆత్రుత పెరిగి ఇక చిన్న పరిశోధనలాగ మొదలుపెట్టి నాకు తెలిసినమేరకు వివరాలు సేకరించగలిగాను.

      మాష్టర్ విశ్వం గారికి నావంతు కానుకగా ఆ వికిపీడియా పేజి క్రియేట్ చేశాను. అక్కడ రుజువులు చూపించడానికొంత చిక్కు వచ్చిపడింది. blogspot లాంటివి ఆధారాలుగా చూపలేము. వెతగ్గ వెతగ్గ ఇది దొరికింది https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-517195 .

      కాని విశ్వం గారి అబ్బాయి తారసపడతారు అని ఊహించలేదు. మీ మొబయిల్ కి నేను whatsapp మెసెజ్ చేసాను...556తో end అవుతుంది నా నెంబరు... NTR, ANR, SV Rangaraoలు చిత్రసీమలో అడుగుపెట్టకమునుపే మెరిసిన నక్షత్రం మాష్టర్ విశ్వం. కొనసాగివుంటే కచ్చితంగా చాలా బాగుండేది అని నా అభిప్రాయం.

      ఓపికగా పెద్ద జవాబు ఇచ్చినందుకు చాలా సంతోషమండి.

      Delete
    2. నా ఈ-మెయిల్ ఐడి satish.bulusu@gmail.com

      Delete
    3. >>>జీవన్ముక్తి పాటలు, ఆయన 40 ఏళ్ళకు పైగా రేడియో లో పాడిన లలిత గీతాలు, వేసిన బొమ్మలు నా వద్ద వున్నయ్. >>>

      వాటిని ఏదైనా బ్లాగులో గాని youtube లో గాని భద్రపరిస్తే బాగుంటుంది.

      Delete
    4. అవును నిహారిక గారు... తెలుగు సినిమా తొలినాటి మధురస్మృతులు తర్వాత తరానికి తెలియాలి.... మాష్టర్ విశ్వం గారి నటనాకౌసల్యం ఆయనలో ఒక పార్శ్వం అయితే ఆయన్లో ఉన్న విభిన్న కళలు, తర్వాట జీవిత పయనం నాకు బాగా స్ఫూర్తిదాయకంగా అనిపించాయి.... కళ, విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు.... ఎందరో మహానుభావులు.... వాళ్ళలో మంచి నేర్చుకుని మనజీవితాలని చక్కదిద్దుకోవాలి అంతే....

      Delete
  2. ఈ సినిమా youtube లింక్ ఇవ్వగలరా ?

    ReplyDelete
  3. శ్రీ గారు,
    మీ వ్యాఖ్య మనసుని కదిలించింది. దేవుడికి తెలియదా ?

    ReplyDelete
    Replies
    1. నేను కేవలం జరిగినది వ్రాశాను, చూచె ద్రుష్టి లోనే అంతా.

      Delete
  4. డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గారు అద్భుతమైన నటుడు. అలనాడు తెలుగు వెండితెర మీద వెలిగిన నక్షత్రాలలో ఒకరు.

    1950ల నాటి “కన్యాశుల్కం” చిత్రంలో (సావిత్రి, NTR, CSR, విన్నకోట రామన్న పంతులు ప్రభృతులు నటించిన చిత్రం) డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గారు లుబ్ధావధానులి పాత్రను మహా సమర్థవంతంగా పోషించారు.

    ReplyDelete
    Replies
    1. అవును ఆయన గొప్పనటుడు. కన్యాశుల్కం నాకు అమితంగా నచ్సిన పాత సినిమాల్లో ఒకటి. అప్పట్లో 1942 బాలనాగమ్మ చిత్రం కోసం వెతికినది ఆయన నటన చూడటానికే. ఇక దొరకదు అని హోప్ వదిలేసుకున్నా. అనుకోకుండా దొరికింది.

      Delete
    2. 1890వ దశకంనాటి కన్యాశుల్కమ్ నాటకాన్ని సుమారు ౬౦యేళ్ల తర్వాత తీసి మంచి సాహసం చేసారు. అందులో వచ్ఛే సురేంద్రనాథ్ బెనర్జీ, భాష్యం ఐయంగార్ ప్రస్తావన 1955 అప్పట్టి వాళ్లకి కొంతవిడ్డురంగా ఉండవచ్చును కని 1890s కాలం వాళ్ళకి బాగ సుపరిచితులే.

      Delete