Monday, April 20, 2020

ఓయ్ గోరువంక

ఓయ్ గోరువంకా
ఉలుకూ పలుకూ లేకుండా
ఏమిటా మౌనం..

నిద్రలోకి జారుకొమ్మని
సైగచేస్తున్నావా ఏంటి..

ఇంతకు మునుపే కదా
సుప్రభాత కుహుకుహులతో
గాఢనిద్రలోంచి మేలుకొలిపావు

అలుపులేని కిలకిలలతో
ఏన్నో ఊసులు చెప్పేసి
ఒక్క ఉదుటున ఎగిరిపోతే
పట్టుకోలేననుకుంటున్నావా

నా మనసే చిలకలా మారి
నీతో పాటు ఎగురుతోంది
వెన్నెలే నీ విలాసమైతే
చంద్రయానానికి సిద్ధం కానా?

విలాసం=చిరునామా, address

(పరి 21/04/2016)


2 comments:

  1. ఎందాకా ఎగిరేవమ్మా గోరింక......

    వెంకటేష్ హీరోగా వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం` సినిమాలో మీ కవిత కోవలో మంచి పాటుంది చైతన్య గారు.

    వెన్నెలే నీ విలాసమైతే
    చంద్రయానానికి సిద్ధం కానా?

    అయినా.... మనిషి మారలేదూ.. ఆతని కాంక్ష తీరలేదు. (గుండమ్మ కథ పాట)

    ప్రకృతి దర్శనం మొత్తం మనిషి ఊహలకు మంచి ప్రేరణలే.

    బాగుంది సర్ కవిత. మీ కవితలలో తెలుగు వెలుగుతుండడం అభినందనీయం.

    ReplyDelete
    Replies
    1. //ప్రకృతి దర్శనం మొత్తం మనిషి ఊహలకు మంచి ప్రేరణలే.

      బాగుంది సర్ కవిత. మీ కవితలలో తెలుగు వెలుగుతుండడం అభినందనీయం.//
      చాలా థాంక్స్ అండి. మనకి కలిగే చిన్న చిన్న స్పందనలు కూడా అప్పుడప్పుడూ మనలో కవితారసస్పందన ని కలిగిస్తాయి అని నమ్ముతాను

      Delete