ఏమౌతుందేమౌతుంది
మూసపోతకి భిన్నంగా
నీ జీవితగమనం కొనసాగుతే
ఏమౌతుందేమౌతుంది
మూసపోతకి భిన్నంగా
నీ జీవితగమనం కొనసాగుతే
ఏమౌతుందేమౌతుంది
గేలిచేసి గోలచేసి
కొంతమంది నవ్వుతారు
అదునుచూసి పదునుగా
మాటలతో
రాళ్ళు రువ్వుతారు
కొంతమంది నవ్వుతారు
అదునుచూసి పదునుగా
మాటలతో
రాళ్ళు రువ్వుతారు
నవ్వితే నవ్వనీ
రాళ్ళు రువ్వితే రువ్వనీ
రాళ్ళు రువ్వితే రువ్వనీ
నీ పయనం ఆపలేరు
నీ విజయం చెరపలేరు
నీ కధనే నువ్వు రాయి
కధనాన్నే మార్చేయి
నీ విజయం చెరపలేరు
నీ కధనే నువ్వు రాయి
కధనాన్నే మార్చేయి
కొత్తబాట పరుచుకుంటు
సరికొత్త బాణి కూర్చుకుంటు
వడివడిగా అడుగులేస్తే
సరికొత్త బాణి కూర్చుకుంటు
వడివడిగా అడుగులేస్తే
మహా ఐతే
ఏమౌతుందేమౌతుంది
ఏమౌతుందేమౌతుంది
కాగలవు ఒక స్ఫూర్తి
లభియించును ఘనకీర్తి
మరి ఓడితే
నేర్చెదవు మంచినీతి
విడిచెదవు బ్రతుకుభీతి
లభియించును ఘనకీర్తి
మరి ఓడితే
నేర్చెదవు మంచినీతి
విడిచెదవు బ్రతుకుభీతి
మరి అంతకంటే
ఏమౌతుందేమౌతుంది
ఏమౌతుందేమౌతుంది
ఏమౌతుందేమౌతుంది
ఏమౌతుందేమౌతుంది
10/12/2019 హైదరబాదు
కవిత బాగుంది చైతన్య గారు.
ReplyDeleteఅంతాపోయినా మిగిలి ఉండేది 'భవిష్యత్తు`. అది నీదే కావలసిన అవసరం లేదు, నీ ద్వారా కూడా కావచ్చు. మనం లో నేను ఎపుడూ ఒదిగే ఉంటుంది. నేను లేని మనం లేదు. మనం కోసం కాని నేను సదా వృధా.
//అంతాపోయినా మిగిలి ఉండేది 'భవిష్యత్తు`. అది నీదే కావలసిన అవసరం లేదు, నీ ద్వారా కూడా కావచ్చు.//
ReplyDeleteకరెక్టుగా చెప్పారండి. రీసెర్చ్ లో కూడా ఇలాగే అనిపిస్తుంది. అన్ని మనమే చెయ్యాలి అని కుతూహలం, కృషి ఉన్నా కొంతకాలం తర్వాత మన తర్వాతవాళ్లకి అది అప్పచెప్పక తప్పదు. మనం నాటిన చిరువిత్తుని పరులు నీళ్ళుపోసి మహావృక్షము అయ్యేలాగా చేస్తుంటే ఆ ఆత్మతృప్తి వేరులెండి.
//మనం లో నేను ఎపుడూ ఒదిగే ఉంటుంది. నేను లేని మనం లేదు. మనం కోసం కాని నేను సదా వృధా.//
అబ్బా చాలా బాగా చెప్పారండి.