Wednesday, April 8, 2020

కరోనా - మనిషి మూర్ఖత్వం

చలికాలం చప్పుడుచేయకుండా వెనుదిరిగింది... ఎదురుచూసిన వసంతం రానే వచ్చింది... పర్యాటకులతో పారిస్ పరిఢవిళ్ళాల్సిన వేళ... అది ఆస్వాదించలేని వింతపరిస్థితి... ఆ స్తబ్దతకు నిలువెత్తు సాక్షి ఈఫిల్.
మబ్బులోంచి సూర్యుడు తొంగిచూసినా...ఇళ్ళకే పరిమితమైయ్యారు జనాలు. కాలగమనంలో మనిషి ఎంత పురోగమించినా... అతడి ముందరకాళ్ళబందాలు ఎన్నెన్నో... అవి తనకు తాను ఏర్చి కూర్చి పేర్చుకున్నవి కదా...అంతే మరి.
విలాసానికి చిరునామా లాంటి వీకెండ్ ఇప్పుడు ఏకాంత విలాపానికి తెరతీసినట్టైంది. మొదట్లో కరోనా మహమ్మారి చాలా గుబులుపుట్టించింది కాని మనుషల వికృత చేష్టలు చూసి చూసి వైరసే నయమనిపించింది. మతం తప్ప మానవత్వాన్ని చూడలేని పైత్యం ఒకవైపు... తన దైనందిన జీవితంలో వీసమెత్తు లోపం వచ్చినా తట్టుకోలేక వ్యవస్థని నిందుస్తు వ్యక్తులపై విరుచుకు పడే కొందరి యువత ధోరణి మరో వైపు.... ఏది యేమైనా పర్లేదు నా ఇష్టంవచ్చినట్లు నేనుంటా అనే లెక్కలేనితనం ఇంకోవైపు....
ప్రతిరోజు ఉరకలు పరుగులతో గజిబిజి జనప్రవాహంలో కొట్టుకుపోయే మనుషుల యాంత్రిక జీవనవిధానాన్ని ఒక్కసారిగా స్థంభించుకుపొయేలా చేయగలిగింది కరోనా. ఈ వైరస్ తనకు తానుగా వ్యాప్తిచెందట్లేదు... మనిషి వ్యాపింపజేస్తున్నాడు....తనతో...తన అలవాట్లతో.... మొండితనంతో... లెక్కలేనితనంతో... ఫలితం.... జీవితంలో పొరాడి అలిసిపోయి సేదతీరాల్సిన వయసులోని ముసలివాళ్ళు నేరుగా కాటికి బలవంతంగా గెంటివేయబడటం...
ఇంత గందరగోళంలో "వర్క్ ఫ్రం హోం" చేస్తున్నామని సంబరపడుతున్నారు కాని అసలు హోం అంటే ఏది? మనం నివాసమున్న ఇల్లా? ఉండే ఊరా? భూమా?
కనిపించని స్వర్గం కోసం మతం మారమంటు కాట్ల కుక్కలాగ కరవడానికి ఉన్న గొర్రెమంద చాలానే ఉంది. ఈ అనంతవిశ్వంలో మనమున్న భూమి ఒక్కటే కనబడే స్వర్గం అని మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడో.... "ఉందో లేదో తెలియని దానికోసం ఉన్నదాన్ని నాశనం చేసుకునే ఏకైక జంతువు మనిషి" అనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు. కళ్ళముందు నాశనం కనిపిస్తున్నా సరే అదే బాటలో పయనం చేస్తాడు మనిషి... మారడు.
బ్రతుకు ఆటలో గెలుపు కష్టమే కాని అసలు గెలుపుకి నిర్వచనం ఏంటి? ఎందుకు గెలవాలి? గెలిచి ఏంచేయాలి? అని మనసుని దొలిచే ప్రశ్నలకి జవాబు రాబట్టడం ఇంకా కష్టం. ఈ కలుషితలోకంలో స్వచ్చత ఏదో మారుమూలన నక్కి దాంకుంది. ప్రతీదాంట్లో కాలుష్యమే...మాటల్లో కాలుష్యం...తలపుల్లో కాలుష్యం...నడతలో కాలుష్యం....అమ్మేవాటిలో కాలుష్యం....తినేవాటిలో కాలుష్యం....విద్య కాలుష్యం...వైద్యం కాలుష్యం... ఈ కాలుష్యంలో సదా చస్తు బ్రదుకుతూ గడపడమేనా జీవితం. అంతర్మధనంలేనిదే అమృతం పుట్టదేమో. అప్పటికి కాని ఈ నిరంతర చావు నుండి మనకి విముక్తి దొరకదు. అటువంటి అమరత్వానికై ఎదురుచూస్తూ...

71 comments:

  1. ఆలోచన కలిగించేలా బాగా వ్రాశారు. This is the time for self introspection. మనుష్య జాతి ఒకసారి హింసావలోకనం చేసుకోవాలి.

    సమస్త జీవజాలం పై హింస. సాటి మానవులపై హింస. భూమాతపైన, ప్రకృతిపైన హింస.

    Humans have made this planet almost unlivable.

    This is a good opportunity for the humans to embrace vegetarianism.

    Still there is hope. మనం మారితే క్షమయా ధరిత్రి క్షమిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. GKK (జీ) గారు, Dr.కృష్ణ చైతన్య గారు, ఇతర మిత్రులు,

      // "This is a good opportunity for the humans to embrace vegetarianism." //
      Well said GKK గారు 👌 .

      Philip Wollen అని ఒక ఆస్ట్రేలియా దేశస్థుడు జంతుహక్కుల రక్షణ ఉద్యమకారుడు. ఈ అంశం మీద వారు ఒక సభలో ఇచ్చిన ఉపన్యాసాన్ని ఈ క్రింది విడియోలో చూడచ్చు (గతంలోనే చూసుండకపోతే). చాలా ఆసక్తికరంగా ఉందని నా అభిప్రాయం. ఈ విడియోను కొన్నిరోజుల ముందు ఒకటిరెండు బ్లాగుల్లో కామెంటుగా పెట్టాను. మీరు కూడా మీ మిత్రులకు (ముఖ్యంగా non-veg మిత్రులకు) forward చెయ్యమని నా మనవి. ఈ స్పీచ్ విన్నవారు తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశ.

      "Animals should be off the menu" :: Philip Wollen speech

      Philip Wollen :: wiki

      Delete
    2. అబ్బా...ఎన్నిసార్లు చెపుతారండీ ? ఆరోగ్యానికి మంచిది కాబట్టి మిమ్మల్ని వెల్లుల్లి తినమంటే తింటారా ?

      Delete
    3. ఈ స్పీచ్ లు ఇచ్చే పెద్దమనిషి కూడా తన ఆహారపుటలవాట్లు మార్చుకున్న వ్యక్తే. ఊరూరూ తిరిగి ఉపన్యాసాలు ఇస్తుంటారు. వారి కృషికి మన వంతు మాటసాయం మనమూ చేద్దామనే సదుద్దేశం ...... కాబట్టి ...... ఎన్నిసార్లైనా చెబుతాను 🤘.

      Delete
    4. విన్నకోట sir: మీరు లింక్ ఇచ్చిన Philip Wollen గారి ప్రసంగం విన్నాను. మరి కొందరికి పంపాను.వారు మాంస భక్షణ కు వ్యతిరేకంగా గొప్ప కృషి చేస్తున్నారు

      గోవు, గేదె,మేక,పంది, కోడి, చేప.. ఏ మూగజీవినైనా మాంసం కోసం చంపేముందు ఆ చంపే వారు వాటి కళ్ళలోకి చూడండి.

      మాంసాహారం తినేముందు ఆయా మూగజీవాలు అనుభవించిన యాతన గురు చేసుకోండి మాంస హారులు దయచేసి.

      The stage has come for human beings to evolve to the next stage by leaving behind inhuman barbaric practices.

      Indians are predominantly vegetarian. Let us spread the word.

      వెల్లుల్లి తినకపోతే ఏ ప్రాణికి నష్టం లేదు.

      Delete
    5. మీరు ఎన్నిసార్లు చెప్పినా తింటూనే ఉంటాం.

      Delete
    6. నమస్తే అండి!!!

      రాసింది చదివినందుకు ధన్యవాదాలు... నిజమేనండి.. అదే నా బాధ... మనం భూమిని కాపాడుకోకపోతే మన భావితరాలు ఇప్పుడు లాగనే ఇబ్బంది పడాల్సి ఉంటుంది... ఇప్పుడు వెజెటరియనిజం ఐరోపాలో బాగానే విస్తరిస్తోంది. వైరస్ అనేది మొక్కలుద్వారా వ్యాప్తిచెందకపోవడం నిజంగా గమనించాల్సిన విషయం.... కాని మనం ఎవరిని వేలెత్తి చూపకూడదు... నా ద్రుష్టిలో మాంసాహారి వ్యక్తి కంటే ప్రకృతిపట్ల లెక్కలేనితనంతో ఉండే వ్యక్తి వల్ల నష్టం ఎక్కువజరుగుతుంది అని...

      Read these when you have free time.

      10 ways vegetarianism can help save the planet:
      https://www.theguardian.com/lifeandstyle/2010/jul/18/vegetarianism-save-planet-environment


      Do Plants Feel Pain? Things to Consider by Peta
      https://www.peta.org/features/do-plants-feel-pain/
      [Note: Plants have no brain or central nervous system, which means they can't feel anything. Atleast, as of today we haven't completely understood plant communication system.]


      An interesting observation:
      "Advocates for vegetarianism quite correctly note that the amount of resources - sunlight, water and fertilizers needed to grow animal flesh - is several times larger than that needed to produce an amount of vegetable good of equivalent or superior nutritional quality." (Reference: Page 327, Encyclopedia of Ecology, 2nd.edition, by Brian D. Faith, vol.1, Elsevier Publishers, 2019.)

      Delete
    7. నా ద్రుష్టిలో మాంసాహారి వ్యక్తి కంటే ప్రకృతిపట్ల లెక్కలేనితనంతో ఉండే వ్యక్తి వల్ల నష్టం ఎక్కువజరుగుతుంది అని ". Agree with you Chaitanya Garu. Thanks for sharing links. Maybe slowly change will come

      Delete
  2. అసలు మతం అంటేనే హింస. మతం అంటేనే నాశనం. ఆ మతాన్ని రాజకీయాలనుంచి వేరు చెయ్యకపోతే కలిగుతుంది విధ్వంసం.

    ReplyDelete
    Replies
    1. అజ్ఞానం అజ్ఞానం!

      Delete
    2. మతం కంటే "నా మతమే గొప్ప" అనే భావన విధ్వంసకరమైనది అని నా అభిప్రాయం.

      Delete
  3. Chiru DreamsApril 9, 2020 at 7:22 PM
    అసలు మతం అంటేనే హింస. మతం అంటేనే నాశనం. ఆ మతాన్ని రాజకీయాలనుంచి వేరు చెయ్యకపోతే కలిగుతుంది విధ్వంసం.

    Well Said !

    ReplyDelete
  4. గో>>> గేదె,మేక,పంది, కోడి, చేప.. ఏ మూగజీవినైనా మాంసం కోసం చంపేముందు ఆ చంపే వారు వాటి కళ్ళలోకి చూడండి.>>>>

    వాటి కళ్ళల్లోకి చూస్తే జగన్ కనిపిస్తున్నాడు....అంతే కసా బిసా ..ఫ్రై చేసేసా !

    ReplyDelete
  5. కేసీఆర్ చికెన్ తింటే బలం వస్తుంది అని చెప్పారు తెలుసా ?

    ReplyDelete
  6. చదివిన పాఠకులందిరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనిషి మీద రాసిన కవితల్లో మచ్చుక్కి ఈ రెండు చదవి మీ అభిప్రాయం చెప్పగలరు.

    http://bulusuchaitanya.blogspot.com/2019/12/blog-post_7.html

    http://bulusuchaitanya.blogspot.com/2015/06/blog-post_89.html

    ReplyDelete
    Replies
    1. ఈ రెండు పోస్టులు కూడా చదివానండి. ఆసక్తికరంగా బాగున్నాయి.

      Delete
    2. నా మాట మన్నించి చదివినందుకు చాలా థ్యాంక్స్ అండి నరసింహా రావు గారు. ఇంతకి మీ స్వస్థలం ఎక్కడ అండి? మీది కూడా ఎమైనా బ్లాగు ఉందా?

      Delete
    3. మాది కృష్ణాతీరం. అయితే గత 60 యేళ్ళుగా తూగోజి .... కోనసీమ, పిఠాపురం, కాకినాడ.

      లేదండీ నా స్వంత బ్లాగేమీ లేదు. నేను చదివి ఆస్వాదించే రకం మాత్రమే అన్నమాట. 🙂

      Delete
    4. అచ్చా మంచిది. ఐతే ఎప్పుడైనా యానాం వచ్చారా? మొన్ననే ఇక్కడ వెంకన్నబాబు కళ్యాణోత్సవాలు జరిగాయి. నవరాత్రులు అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

      మా గోదావరి పుష్కరాలు అప్పుడు రాసిన కవిత చదవంది. కేవలం దానికోసం అప్పుడు ఇండియా వచాను.

      https://bulusuchaitanya.blogspot.com/2019/11/blog-post.html

      Delete
    5. ముప్పై అయిదు, నలభై యేళ్ళ క్రిందట మొదటిసారి యానాం వెళ్ళాను (అందరూ అనుకునే పని మీద కాదు లెండి 😁).

      ఇంగ్లాండ్లో చదువుకునొచ్చి, ఏదైనా ఇంజనీరింగ్ సంబంధిత వ్యాపారం మొదలు పెడదామని ఆలోచిస్తున్నాడు మా పెత్తల్లి గారి కొడుకు ఒకతను అప్పట్లో. కొత్త Small Scale Industry లకు భారీ రాయితీలు ఇస్తామని పాండిచెరి ప్రభుత్వం ప్రకటించిందట అప్పట్లో. ఆ వార్త పట్టుకుని మా కజిన్ కాకినాడలో మా ఇంటికి వచ్చాడు. మీ ఊళ్ళో సంబంధిత ప్రభుత్వ శాఖల ఆఫీసుల వారితో మాట్లాడడానికై కాకినాడ నుండి మేమిద్దరం కలిసి మీ ఊరు వచ్చాం స్కూటర్ మీద 🙂.

      రెండో సారి ఎప్పుడంటే .... చాలా చాలా సంవత్సరాల తరువాత .... మీ ఊరుకి కోనసీమకి బ్రిడ్జి కట్టిన తరువాత .... ఒకసారి పని మీద కోనసీమ వెడుతూ మీ ఊరి ప్రక్కనుండే వెళ్ళాను. ఊళ్ళోకి వెళ్ళలేదు.

      Delete
    6. "అందరూ అనుకునే పని మీద కాదు లెండి"

      Disclaimers అదుర్స్ గురువు గారూ.

      Delete

    7. // మా గోదావరి పుష్కరాలు అప్పుడు రాసిన కవిత చదవంది. కేవలం దానికోసం అప్పుడు ఇండియా వచాను.' " //

      కవిత చదివాను, బాగుంది కృష్ణ చైతన్య గారు.
      గోదావరి పుష్కరాలు చూడడానికి అన్ని గంటలు విమాన ప్రయాణం చేసి వచ్చారా? గోదావరి నది మీదున్న మీ అభిమానాన్ని మెచ్చుకోవాలి 👏.

      Delete
    8. అవును అండి. అలాగ పడిందనమాట మావూరిలో మీ అడుగు. బాగుంది.


      హహా మందుకి యానాంకి అవినాభావ సంబంధం ఉందండి. అప్పట్లో ఆంధ్రాలో మధ్యపాననిషేధం అప్పుడు చూడాలి చెక్పోష్టు పోలిసుల అగచాట్లు. బహుశా గబ్బర్ సింగ్ సినిమాలో "మందుబాబులం పాట" రాసినవాడికి స్ఫూర్తికి తీగలాగితే మా యానాంలో డొంక ఏదో ఒక మందుకొట్టులో బయటపడచ్చు.


      నేను కూడా పరిశ్రామిక రాయితి గురించి విన్నాను. అలాగే కదా మావూర్లో చిత్తూరు జి.యెన్.నాయుడు స్థాపించిన రీజెన్సి సిరామిక్స్ టైల్స్ ఒక వెలుగువెలిగింది. ఆ రాయితివల్లన చాలా కంపనీలు ఎర్పడ్డాయి. బయట ఆంధ్రా నుండి చాలామంది వలస వచ్చి యానాంలో స్థిరపడ్డారు. వాట్ కి ముందు బాగా లాభం కనిపించేది అని అంటారు. ఇప్పుడు కొన్ని రాజకీయ కారణాలవల్ల దాదాపు చాలా మటుకు అన్ని మూతబడ్డాయి (రీజెన్సితో సహా). గోదావరి పైన బాలయోగి వారధి మీదుగ బైపాస్ రోడ్ పడ్డ తర్వాత యానంవూర్లోకి రావాల్సిన పనిలేదు. బ్రిడ్జి పడకముందు రోజులు ఇప్పటికి గుర్తు. కొనెసీమకి వెళ్ళాలి అంటే పడవలు, పంట్లు, లాంచీలు మీదుగ "ఎదురులంక" వెళ్ళేవాళ్ళం.



      "కాలం మారిపోతుంటుంది, స్మృతులు మిగిలిపోతాయి వాటిలో కొద్దోగొప్పో కధలౌతాయి."

      Delete
    9. // కవిత చదివాను, బాగుంది కృష్ణ చైతన్య గారు.
      గోదావరి పుష్కరాలు చూడడానికి అన్ని గంటలు విమాన ప్రయాణం చేసి వచ్చారా? గోదావరి నది మీదున్న మీ అభిమానాన్ని మెచ్చుకోవాలి 👏. //


      గోదారి అనె పలుకు రోజుకి ఒక్కసారైన తెలిసోతెలీకో మా నోట్లో నానుతుంది అండి. ఎప్పుడో 91లో పుష్కరాలు అప్పుడు నేను బాగా చిన్నపిల్లాడ్ని. ఇక 2003నాటికి పాండిచ్చేరిలో చదువున్నప్పుడు అప్పటి ఆర్థిక పరిస్థితివల్ల నా ఫ్రెండ్స్ అందరు వెళ్ళినా నేను వెళ్ళలేకపోయా. బహుశా ఆ లోటు బలంగా నాటుకుపోయి 2015లో వెళ్ళడానికి నాంది పలికింది.

      Delete
    10. ప్రముఖ పారిశ్రామిక వేత్త రాం ప్రసాద్ రెడ్డి గారు పాండిచెర్రి రాయితీల దృష్ట్యా మొదటి ఫాక్టరీ అక్కడ స్థాపించడమే కాక కంపెనీ పేరు కూడా అరబిందో అని పెట్టారు. అదే వారి విజయ పరంపరలకు తొలి మెట్టు.

      "Founded in 1986 by Mr. P. V. Ramprasad Reddy, Mr. K. Nityananda Reddy and a small group of highly committed professionals, Aurobindo Pharma was born of a vision. The company commenced operations in 1988-89 with a single unit manufacturing Semi-Synthetic Penicillin (SSP) at Pondicherry"

      https://www.aurobindo.com/about-us/

      Delete
    11. // “ కాలం మారిపోతుంటుంది, స్మృతులు మిగిలిపోతాయి వాటిలో కొద్దోగొప్పో కధలౌతాయి." //

      చాలా కరక్ట్, కృష్ణ చైతన్య గారు 👌.

      Delete
  7. మూగ జీవాలు లో కూడా కనిపిస్తున్న జగన్ అన్న. జై జగన్.

    కేసీఆర్ గారు సి విటమిన్ ఉన్న పండ్లు ఎక్కువగా తినమని ప్రెస్ మీట్ లో చెప్పారు.

    ReplyDelete
  8. మీ పోస్టుకి సంబంధం లేని ఈ వ్యాఖ్య సరదాగా వ్రాస్తున్న వ్యాఖ్య, ఏమనుకోకండి కృష్ణ చైతన్య గారు. 😉

    మీ ప్రొఫైల్ లో "తూర్పు గోదావరి జిల్లా లో యానాం" అని వ్రాసుకున్నారు. తూ.గో.జి మీద మీ అభిమానానికి సంతోషమే కాని యానాం అసలు ఏపీ రాష్ట్రంలోనే లేదు కదా, ఇంక ఏపీలోని జిల్లాలోకి ఎలా వస్తుందండి 😉😉?

    మీ ప్రొఫైల్ మీ ఇష్టం అనుకోండి గానీ ఒక ఉచిత సలహా .... తూ.గో.జి కి ప్రక్కనే ఉన్న యానాం (పుదుచ్చెరి U/T ) అంటే బెటరేమో, factually correct గా ఉంటుందేమో కదా ఆలోచించండి?

    ReplyDelete
  9. మీ ఆక్షేపణ ముమ్మాటికి నిజమే అండి. మావూరు గురించి చెప్పాలంటే ఎప్పుడూ ఇదే ఇబ్బంది. పాండిచ్చేరి అంటే ఎక్కడో తమిళనాడులో ఉందనుకుంటారని తు.గో.జిలో అని చెబుతుంటాను. దగ్గర్లో ఉన్న సూరసేన యానాం (యస్. యానాం) అనుకుంటారు అని మా ముందు తరంవాళ్ళు ఫ్రెంచి యానాం అని పిలిచేవారు. నా ప్రొఫైల్లో మారుస్తాను. మీ సూచనకు చాలా థ్యాంక్స్ అండి. UTని ఇప్పటికీ మేము అధికారికంగా తెలుగులో "కేంద్రపాలిత ప్రాంతం" అనే పిలుస్తాము. కొన్నిసార్లు సింపుల్‌గా పాండిచ్చేరి స్టేటు అని కూడ వాడుతుంటారు. ఇప్పుడు "పుదుచ్చేరి"గా పేరు మారింది.

    ReplyDelete
    Replies
    1. మీ సందిగ్ధత సమంజసమే లెండి 🙂.

      నాకొక సందేహం కృష్ణ చైతన్య గారు. మీ రాష్ట్రంలో తమిళుల ప్రభావం ఎక్కువ కదా .... తమిళ భాషతో సహా. వాళ్ళు ఇతర భాషలనేమీ అంతగా ఆదరించరు (తమ అవసరానికి తప్ప) కాబట్టి మీ యానాం స్కూళ్ళల్లో తెలుగు మీడియం గానీ, ఒక సబ్జెక్ట్ గా తెలుగు భాషను తీసుకునే అవకాశం గానీ కల్పించి ఉంటారని అనుకోను. పుదుచ్చేరి వారు పెట్టిన సిలబసే యానాంలో కూడా అనుసరించాలి కదా. మరి అటువంటి నేపధ్యంలో మీకు తెలుగు చదవడం వ్రాయడం ఇంత బాగా ఎలా వచ్చింది ? (మీరు మీ స్కూలుచదువు యానాంలోనే చదువుకున్నారనే అంచనాతో ఈ ప్రశ్న అడుగుతున్నాను)

      Delete
    2. అలాగ ఏమిలేదండి. 1956 విలీన ఒప్పందం ప్రకారం ఫ్రెంచి అధికారబాష కింద కొనసాగించబడింది. 1965 చట్టం ప్రకారాం తమిళం, ఆంగ్లంతో పాటుగ యానాం ప్రాంతంలో మటుకు తెలుగు, అలగే మాహే ప్రాంతంలో మలయాళం అధికార భాషలుగా గుర్తించబడ్డాయి. కాబట్టీ ఇక్కడ మాకు తెలుగు మాధ్యమంలో చదువుంటుంది. తమిళంలో కాదు. ఇంటర్ వరుకు ఏ.పి.బొర్డు వాళ్ళ సిలబస్ ఉంటుంది. ఆ పైన చదువులు మాత్రం పాండిచ్చేరి యూనివర్సిటి కిందకి వస్తాయి. అందువల్లనే ఇక్కడ 18 వయసులోపు పిల్లలకి అసలు తమిళం ప్రస్తావనే ఉండదు (ఆటలు కోసం పాండిచ్చేరి వెళ్తే తప్ప). నేను ఇక్కడి గవర్నమెంటు ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదివాను. నా తెలుగు అంతా మా అమ్ముమ్మగారి చలవ.

      త్వరలోనే తెలుగుభాషపైన ఇంగ్లీషు మీడియం చదువు మీద చిన్న వ్యాసం రాద్దామనుకుంటూన్నాను. (అంటే ఇటీవల దీనిపై ఆంధ్రలో పెద్దదుమారం చెలరేగింది కదా.)

      Delete
    3. పోన్లెండి, ఆంధ్రదేశపు నడిబొడ్డునున్న యానాం ప్రజలు తెలుగు మర్చిపోకుండా వెసులుబాటు కల్పించింది పాండిచెరి ప్రభుత్వం, అంతవరకు నయం.

      మీరు తలపెట్టిన వ్యాసం తప్పకుండా వ్రాయండి. All the best 👍.

      Delete
    4. అది మునుపటి ఫ్రెంచివాళ్ల వికేంద్రికృత పరిపాలనవిధానానికి కొనసాగింపు అనుకుంటాను. మేము భౌగోళికంగా, భాషాపరంగా వేరువేరు అయినప్పటికి ఒకప్పట్టి ఉమ్మడి ఫ్రెంచిపాలనా చరిత్ర వల్లన కలిసికట్టుగా ఉంటున్నాము. యానాంను ఆంధ్రాలో కలపాలి అని చాలా ప్రయత్నాలు జరిగాయి కాని నేటివ్స్‌కి సుతరాము ఇష్టంలేక అవన్ని నిర్వీర్యం అయిపోయాయి. మచిలిపట్నంలో కూడా పరాసుపేట/ప్రెంచిపేట అని ఒకప్పుడు ఫ్రెంచివాళ్ళ అధీనంలో ఉండేది. తర్వాత ఇండియాలో విలీనం చేసేశారు.

      అన్నట్టు ఇప్పుడు గుర్తొచ్చింది. మా ఎలక్ట్రిసిటి బిల్లు మాత్రం ఇంగ్లీషు, తమిళంలో ఉంటుంది. అలాగ అక్కడక్క తమిళచాయలు కనపడుతుంటాయి కాని జనం పెద్దగా పట్టించుకోరు.

      I will write it soon. Thanks andi.

      Delete
    5. // "త్వరలోనే తెలుగుభాషపైన ఇంగ్లీషు మీడియం చదువు మీద చిన్న వ్యాసం రాద్దామనుకుంటూన్నాను. (అంటే ఇటీవల దీనిపై ఆంధ్రలో పెద్దదుమారం చెలరేగింది కదా.)" // (👆 your comment dated April 10, 2020)

      Just for your information 👇.

      AP High Court quashes GO on English Medium in schools

      Delete
  10. మీ ప్రొఫైల్ లో మార్చినట్లున్నరే? ఇప్పుడు భేషుగ్గా ఉంది.
    నా సలహాను పాటించినందుకు థాంక్ల్, కృష్ణ చైతన్య గారు.

    ReplyDelete
  11. హాహా!! మంచి చెప్పినప్పుడు పాటించడంలో ఇబ్బందేముంది చెప్పండి.

    ReplyDelete

  12. యానాము లో పుట్టి పెరిగిన మరో బ్లాగరు
    బొల్లోజు బాబా

    sahitheeyanam.blogspot.com


    ReplyDelete
    Replies
    1. //యానాము లో పుట్టి పెరిగిన మరో బ్లాగరు బొల్లోజు బాబా//

      హాహా ఆయనెందుకు తెలియదు. మంచి కవి. అంతుకుమించి మంచి చరిత్రపరిశోధకులు. వాళ్ళ నాన్నగారు కూడా పేరుమోసిన కవి "సువర్ణ శ్రీ" బొల్లోజు బసవలింగం గారు. అప్పట్లో ఫ్రెంచి కూడా నేర్పేవారు. అసలైన నేటివ్స్ ఫ్రాన్సు వెళ్ళిపోవడం. ఆంధ్రనుండి వచ్చిన వలసజనానికి మా చరిత్ర తెలియకపోడంతో క్రమేపి యానాంలో గత ఫ్రెంచి ఛాయలు దాదాపు కనుమరుగైపొయాయి.

      Delete
  13. బొల్లోజు బాబా గారు “యానాం చరిత్ర” అనే పుస్తకం వ్రాసారని ఎక్కడో చదివినట్లు గుర్తు.

    ReplyDelete
    Replies

    1. బొల్లోజు వారు వ్రాసారో లేదో నాకు తెలియదు :) గవర్నమెంటు వారి యానాము చరిత్ర " ఫ్రెంచ్కు తెలుగు" లో అవధరించండి :)

      https://yanam.gov.in/te/%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0/

      Delete
    2. //బొల్లోజు బాబా గారు “యానాం చరిత్ర” అనే పుస్తకం వ్రాసారని ఎక్కడో చదివినట్లు గుర్తు.//

      అవును రాశారు. దానికి నేను ఫ్రాన్సులో ఫ్రెంచి ఆర్ఖయివ్స్ నుండి సేకరించిన సమాచారంకూడా అప్పట్లో ఆయనకి అందించాను. 2006 అప్పట్లో నేను పరిశోధన చేసి మా యానాం గురించి ఆంగ్ల వికిపీడియా పేజిలో చాల విషయాలు పొందుపరిచాను. బొల్లొజు ఆయనకి నాకు స్నేహం అలాగె కుదిరింది. (మా యానాంలో అలగ ఇంటిపేర్లతో సంబోధించడం అలవాటు. బహుశా ఫ్రెంచి వాళ్ళ నుండి పుణికిపుచ్చుకున్నామేమో ఈ అలవాటు.)

      https://en.wikipedia.org/wiki/Yanaon (ప్రెంచి పాలన కాలం అప్పుడు)

      https://en.wikipedia.org/wiki/Yanam

      https://en.wikipedia.org/wiki/User:Bsskchaitanya (నా వికీపీడియా పేజి)

      Delete
    3. మీరిచ్చిన వికీ పేజీలు చదివాను. మీరు చేసిన విశేష కృషి కూడా ప్రతిఫలిస్తోంది. మీకు పలు అవార్డులు వచ్చాయని కూడా తొలుస్తోంది, సంతోషం.

      మీ ఊరి గురించి ఆసక్తికరమైన సంగతులు తెలిసాయి. ఫ్రెంచ్ వారి కన్నా ముందు యానాం డచ్ వారి పాలనలో ఉన్నదిట కదా. అలాగే కొంతకాలం బ్రిటిష్ వారి క్రింద కూడా. అలాగే C.P.బ్రౌన్ గారికి కొన్ని పురాతన తెలుగు గ్రంధాలు యానాంలో లభించాయట.

      మామూలు తెలుగు పేర్లు, తెలుగు ఇంటిపేర్ల స్పెల్లింగ్ వ్రాసే పద్ధతి కూడా ఆసక్తికరంగా అనిపించింది (మీ ఇంటిపేరుతో సహా). బహుశః ఫ్రెంచ్ ప్రభావం అయ్యుంటుంది. అంతే లెండి, మా ప్రాంతాల్లో ఆంగ్లేయుల ప్రభావం వలన Masulipatam (మచిలీపట్నం), Vizagpatam (విశాఖపట్నం), Row (రావు) వంటి స్పెల్లింగులు నడవలా చాలా కాలం, అలాగే మీ దగ్గర.

      యానాంలోను, పుదుచ్చేరిలోనూ ఈ నాటికీ ఫ్రెంచ్ భాషను official language గా గుర్తిస్తారా? స్కూల్ లో నేర్పిస్తారా?

      ఈ విషయాల్లో మీకు ఆసక్తి మెండు కాబట్టి మరొక సంగతి చెప్పండి .... యానాం అనేది తెలుగేనా లేక పరాయిభాషా పదమా? ఎందుకంటే స్పెల్లింగ్ ఫ్రెంచ్ లో Yanaon అని వ్రాస్తారని గమనించాను వికీలో. అందువల్లే పైన నా సందేహం కూడా.

      Delete

    4. ఇనాము గా వచ్చినది యానాం అయింది :)

      Delete
    5. విన్నకోటవారు,
      యానం అంటే ప్రయాణం అనే అర్ధం ఉంది,ఇది సంస్కృత పదమనుకుంటా. ఇక ఇనాం,ఈనాం (బహుమతి) అనే మాట ఉరుదూ పదం. ఇనాం ఐతే, ఆ ఇనాం ఎవరు ఎవరికో ఇచ్చి ఉండాలిగా, చరిత్రలో. సూరసేన యానం అనే ఊరుంది. కాకినాడ దగ్గర చొల్లంగి అనేది ఒక రేవుపట్టణం పాతరోజుల్లో.నా ఉద్దేశం యానం కూడా నాటి రోజుల్లో రేవు పట్టణమే ఐ ఉండాలి. కోటి పల్లి కూడా అప్పటి రేవు పట్టణం.ఆ వూరు పేరు యానం యానాం కాదు

      Delete
    6. అలా అంటారా, శర్మ గారు? యానం అంటే ప్రయాణం అనే మాట బాగానే ఉంది. ప్రస్తుత పేరుకి దగ్గరగా ఉంది. తప్పకుండా రేవే అయ్యుంటుంది కూడా.

      ఇనాం / ఈనాం అనే పదాన్ని గనక తీసుకుంటే మరి మచిలీపట్నం నవాబు గారు ఫర్మానా ఇచ్చారనో లేక విజయనగరం మహారాజు గారు బుస్సీ కి బహుమతిగా ఇచ్చారనో వికీలో తెలుస్తోంది.

      యానాం పండితులే వివరించాలి.

      Delete
    7. //మామూలు తెలుగు పేర్లు, తెలుగు ఇంటిపేర్ల స్పెల్లింగ్ వ్రాసే పద్ధతి కూడా ఆసక్తికరంగా అనిపించింది (మీ ఇంటిపేరుతో సహా). బహుశః ఫ్రెంచ్ ప్రభావం అయ్యుంటుంది.//

      ఫ్రెంచి అనువాదంలో బులుసు అని పలకాలి అంటే అలాగే bouloussou అని రాయాలి. లేదంటే bulusu అని ఇంగ్లీషులో లాగ రాస్తే ఫ్రెంచివాళ్ళు "బ్యుల్యుజ్యు" అని పలుకుతారు. (ఉదాహరణకి వెంకటరావు vincata row; ఈశ్వర issoira; విష్ణు vichenou; జలదంకి zaladinguy; జిన్నూరి zinnoury; దొంతాబక్తుని dontabactouny; షేక్ ఉస్మాన్ జంగ్ chek ousmane zingue; కోమటి comoutty; తెలగ telinga).

      మనం ఇంగ్లీషులో రాసేది ఇంగ్లీషువాడు మనపేరు సరిగ్గ చదవడానికి వీలుగ ఉండేలాగ ఉంటుంది. ఎటొచ్చి మనకి అలవాటైపోయి తెలియట్లేదు. ఇది కూడా అంతే అండి ఫ్రెంచివాళ్ళకి అనువుగా రాయడం అంతే.


      //యానాం అనేది తెలుగేనా లేక పరాయిభాషా పదమా? ఎందుకంటే స్పెల్లింగ్ ఫ్రెంచ్ లో Yanaon అని వ్రాస్తారని గమనించాను వికీలో.//

      యానాంని అప్పటి నిజాం నవాబు ముజాఫర్ జంగ్ తనని గద్దెనెక్కించినందుకు కృతజ్ఞతగా ఫ్రెంచివాళ్ళకి "ఇనాము"గా ఇస్తూ ఫర్మానా జారికేశాడు. తర్వాత వచ్చిన సలాబత్ జంగ్ దాన్ని ధృవీకరించాడు. ఏనాం అనే పార్శి పదం పలకడంలో తేడాతో ఉర్దులో ఈనాంగా మరింది. ఇప్పటికి రెవెన్యూశాఖవారి ముద్రలో "ఏనాము" అనే ఉంటుంది. తెలుగువాళ్ళ నానుడిలో ఏ, య ఒకదానిబదులు మరోటి పలకడం గమనించవచ్చు. (ఉదా: ఏనాది->యానాది; వేట-->ఏట-->యాట). ఇప్పటివాడుక భాష ఉచ్చారణలో "యానాఁవ్" అని పలుకుతున్నుదాన్నిఫ్రెంచిలో Yanaon అని తర్జుమా చేశారు.

      Delete
    8. merci.
      ఆ పేరు అలా వచ్చిందన్నమాట. అయితే “జిలేబి” గారి అంచనా కరక్టే అన్నమాట.
      ఇంకో సంగతి చెప్పలేదు మీరు .... అదే మీ స్కూళ్ళల్లో ఇప్పటికీ ఫ్రెంచ్ భాష నేర్పిస్తున్నారా? స్కూల్ విద్యలో అసలు ఏయే భాషలు నేర్పిస్తారు? చెప్పగలరా?

      Delete
    9. యానాంలో ఫ్రెంచి దాదాపు కనుమరుగైంది. ఫ్రెంచి మాధ్యమం లేదా ఫ్రెంచిభాషా ఒక సబ్జెక్టుగా బోధించడం అనేవి పాండిచ్చేరిలో, కారైక్కాల్లో మాత్రమే ఉంది. ఇంగ్లీషు, తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలు నేర్పుతారు।కాకపొతే ఇంటర్, డిగ్రీలలో  ఫ్రెంచి ఒక్ సబ్జెక్టుగా తీసుకునే వెసులుబాటు ఉంది.

      పాండిచ్చేరి యూనివర్సిటిలో ఐతే ఫ్రెంచి డిపార్టుమెంటుంది. పిహెచ్‌డి, పరిశోధనలు లాంటివి కూడా చేయచ్చు. 

      Delete
    10. అప్పట్లో బొల్లోజు బసవలింగం గారు కొన్నేళ్ళు L'Alliance Française de Yanaon (అలియాన్స్ ఫ్రాన్సేజ్ దె యానాఁవ్) పేరిట ఆసక్తి ఉన్నవాళ్ళకి ఫ్రెంచి నేర్పేవారు. ఒరిజినల్ నేటివ్స్‌కి ఇప్పటికీ ఎంతోకొంత ఫ్రెంచిపట్ల మక్కువ ఉంది కాని నేర్పేవాళ్ళు తగ్గిపోయారు.

      Delete
    11. థాంక్య్ కృష్ణ చైతన్య గారు.
      ఏపిలో స్కూల్ విద్యలో భాషాబోధనలాగానే ఉందనిపిస్తోంది మీ దగ్గర కూడా (స్టేట్ సిలబస్ స్కూళ్ళల్లో).

      Delete
    12. అవునండి. కానీ ఫ్రెంచి ఇంకా అధికారిక భాష కాబట్టి భవిష్యత్తులో మార్పులు ఉండవచ్చు. పాండిచ్చేరిలో ఐతే ఫ్రెంచి మాధ్యమం ఉంది. అంగ్ల, తమిళ మాధ్యమం ప్రతి స్కూల్లో ఫ్రెంచి ఒక భాషగా బోధిస్తారు.

      ఒక గమ్మత్తైన విషయం చెబుతాను. ఇక్కడ నేటివ్స్‌లో పాతకాలపు చరిత్ర, వారసత్వం కాపాడుకోవాలనే వాంచ మొదలైంది. యానాం ఇండియాలో వీలీనానికి తీవ్రంగా ఎదిరించి పోరాడిన అప్పటి మేయర్ సమతం కిష్టయ్య భారత పోలిస్చేసిన చర్యలో చంపబడ్డాడు. అతని శవాన్ని ముక్కలుచేసి గోదావరిలో పాడేశారుట. మరుసటిదినమే ఫ్రెంచి ప్రభుత్వం అతనిని అమరవీరుడిగా గుర్తిస్తూ అందుకు తగిన బిరుదు ఇస్తూ చట్టసభలో తీర్మానం చేసింది. భారత రికార్డుల్లో అతనిని ద్రోహి కింద చిత్రీకరించారు (అప్పట్లో యానాంలో చాలామందికి విలీనం ఇష్టంలేదు. నెహ్రు కనుసన్నల్లో ఇక్కడ పోలిసుచర్య జరిగింది. విలీన వ్యతిరేకులు అప్పట్లో అటకలు, కోడిగంపలు, గడ్డివాముల్లో దాంకున్నారుట). విషయం ఏంటంటే సమతం ఆయనకి మొన్నీమధ్యనే బీచ్చిరోడ్డులో విగ్రహం ఆవిష్కరించారు. కాకపొతే, మేయర్ అని మాత్రమే రాశారు. సినినటులు, యానాం నేటివ్ ఐన కనకాల దేవదాసు గారి తండ్రి కనకాల తతయ్యగారు మరియు అప్పుడున్న ఇతర ప్రముఖులు నాకు చెప్పినదాని బట్టి వాళ్ళందరికి సమతం ఆయనకి, ఆయనచేసినా వృధాపోరాటానికి చాలా మద్దతు, సానుభూతి ఉంది. కాని ఇండియా దృష్టిలో ద్రోహి. అలాగే బుస్సీదొర మాకు వీరుడు, హీరో కని బొబ్బిలి వాళ్ళకి విల్లన్ (బొబ్బిలి యుద్ధంలో ఆయన పాత్ర ఉంది). చరిత్రలో మనం చూసే కోణంబట్టి మనుషులని అంచనా వేస్తాం ఏమో.

      Delete
  14. సారీ "యానాం చరిత్ర" కాదు, బొల్లోజు బాబా గారు వ్రాసిన పుస్తకం పేరు "ఫ్రెంచ్ పాలనలో యానాం". 2012 లో వ్రాసారట. వారి బ్లాగు sahitheeyanam.blogspot.in లో 2012 March నెలలోని పోస్టుల్లో ఈ పుస్తకం గురించి చెప్పారు రచయిత. ఈ పుస్తకం kinige.com లో కూడా ఉంది.

    కృష్ణ చైతన్య గారు, please note.

    kinige.com లో పుస్తకం "ఫ్రెంచ్ పాలనలో యానాం" (బొల్లోజు బాబా రచన)

    పుస్తకావిష్కరణ గురించి 2012 March 25 నాటి బొల్లోజు బాబా గారి బ్లాగ్ టపా

    పుస్తకం గురించి 2012 March 28 నాటి బొల్లోజు బాబా గారి బ్లాగ్ టపా

    ReplyDelete
  15. బాగున్నాయండీ విద్యాబోధనా విశేషాలు. యానాం స్కూళ్ళల్లో ఫ్రెంచ్ నేర్పించడం మరింక లేదన్నారు కదా, అయితే మీరు ఫ్రెంచ్ భాష ఎక్కడ / ఎలా నేర్చుకున్నారు? (అంటే ... మీరు ఏ తరం వారో నాకు తెలియదు, కానీ లేటెస్ట్ ఆధునిక టెక్నాలజీ అయిన 5G మీద PhD చేశానని మీ profile లో అన్నారు కాబట్టి యువకులే అయ్యుంటారని, వయసు 30-35 మధ్య ఉండచ్చనీ నా అంచనా, ఏమంటారు?)

    యానాం విలీనోద్యమం గురించి మీరు చెప్పిన సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే విలీనవ్యతిరేక ప్రముఖుడు, ఆనాటి Acting Mayor అయిన సమతం కిష్టయ్య గారి మరణం గురించి విభిన్న కథనాలు ఉన్నట్లున్నాయి కదా? సాయుధపోలీసులు కాల్చి చంపారంటున్నారు మీరు. కాని మద్దింశెట్టి సత్యానందం (అంతకు ముందు Mayor) వెనక నుండి పిస్టల్ తో కాల్చాడని "Samatam Kistayya" అనే వికీ పేజీలో ఉందే? అలాగే "Coup d'Etat of Yanaon" అనే మరో వికీ పేజీలో జూన్ 13, 1954 న విలీనోద్యమకారులను కొద్దిసేపు ప్రతిఘటించి తర్వాత తప్పించుకునే ప్రయత్నంగా పైడికొండల వారి ఇంటి కాంపౌండ్ గోడ మీద నుండి పడి చనిపోయాడని ఉంది (78 year old man). మరణం గురించి బహిరంగ ప్రకటన నిమిత్తం మాత్రం భారత మిలిటరీ వారు కాల్చి చంపారని డిక్లేర్ చేసారేమో (పబ్లిక్ కోసం విలీనోద్యమకారులు ఆమాట అనుంటారు అని .... నా ఊహాగానం, నిజానిజాలు దేవుడికే తెలియాలి). మీరన్నట్లు కిస్టయ్య గారి మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోదావరిలో పడేసారన్న విశేషం నాకు వికీలో గాని, బొల్లోజు బాబా గారి పుస్తకంలో సదరు పేజిల్లో గాని కనపడలేదు ... స్ధానిక కథేమో? కాని మీరన్నట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం వారు సమతం గారిని ఫ్రెంచ్ దేశభక్తుడిగా గుర్తించారట కదా, అంతే గాక పారిస్ లో వారి విగ్రహన్ని పెట్టారనీ వికీలో ఉంది ... ఆ విగ్రహాన్ని మీరు చూసే ఉంటారుగా? ఒక దేశానికి ద్రోహి (భారత్ దృష్టిలో), మరొక దేశానికి (ఫ్రాన్స్) దేశభక్తుడు ...... మీరన్నట్లు చూసే కోణం బట్టి ఉంటుంది. సర్లెండి, యానాంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా మీకు సరైన సమాచారమే తెలిసుంటుంది లెండి.

    ఇక మరో విషయం నా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను (డూప్లే గురించి ఏదొ క్లుప్తంగా చరిత్ర పుస్తకాల్లో చెప్పినది మినహాయించి భారతదేశంలో ఫ్రెంచ్ పాలకుల సంగతి అంతగా తెలియదు కదా మాకు). బుస్సీ మీకు హీరో అన్నారు మీరు. ఏ రకంగానో తెలుసుకోవచ్చా? ప్రజారంజకంగా పాలించాడా? సాంఘిక సంస్కరణలేమన్నా చేశాడా? యానాంలో "పెద్దొర" గా పని చేసాడా ఎప్పుడయినా (బొల్లోజు గారి పుస్తకంలో "పెద్దొరలు" చాప్టర్ ఇంకా చదవలేదు లెండి)? ఎస్, మీరన్నట్లు బొబ్బిలిని కూలదొయ్యడానికి విజయనగరం రాజుకు సహకరించిన విదేశీయుడుగా బుస్సీ ఆంధ్రుల దృష్టిలో ఒక విలనే.

    తమ రాజ్యవిస్తరణ, వ్యాపారం మీదే ఎక్కువ మక్కువ కలిగిన వలసపాలకులనెవరినయినా హీరోలుగా అభిమానించాలంటే ఆ వ్యక్తి చాలా విశిష్టమైన పాలన అందించుండాలి. ఆంగ్లేయులకు సంబంధించినంత వరకు మేమూ కొద్దిమందిని అభిమానిస్తాము - ప్రముఖంగా చెప్పుకునేది "అపర భగీరధుడు" సర్ ఆర్థర్ కాటన్, ఎందుకో మీకూ తెలుసు. అలాగే "సతీసహగమనం" లాంటి సాంఘిక దురాచారాలను అరికట్టడంలో రాజా రామమోహన్ రాయ్ గారికి విశేష సహకారం అందించిన లార్డ్ విలియం బెంటింక్. భారత్ లో అనేక ప్రాంతాలు కదా, కొన్ని కొన్ని ప్రాంతాల్లో మంచి పనులు చేసి లోకల్ గా హీరోలుగా ఆభిమానించబడిన ఆంగ్లేయులు మరికొంతమంది కూడా ఉండుండచ్చు (Q: అన్నట్లు యానాం, పాండిచ్చెరి స్కూళ్ళల్లో చరిత్ర సబ్జెక్ట్ లో ఆంగ్లేయుల పాలనాకాలం గురించి కూడా బోధిస్తారు కదా? I am just curious to know). అఫ్‌కోర్స్ ఏదయినా మీరన్నట్లు చివరికి చూసే కోణం బట్టి ఉంటుంది లెండి.

    (చాలా పొడుగాటి కామెంట్ వ్రాసినట్లున్నాను కదా. ఏం లేదు, మన దేశంలోని ఒకప్పటి ఆంగ్లేయేతర పాలిత ప్రాంతాల గురించి ఎక్కువ తెలియదు కాబట్టి... ఇప్పుడు native అయిన మీరు పరిచయమయ్యారు కాబట్టి ... మీ ప్రాతం గురించయినా ఇప్పుడయినా కాస్త తెలుసుకుందామని కుతూహలం, అంతే. మీ ఊళ్ళను, మీ చరిత్రను, మీ సంస్కృతిని కించపరిచే ఉద్దేశం ఎంతమాత్రం లేదు.)

    ReplyDelete
    Replies
    1. Of course, వికీపిడియాలో కనబడేదంతా పూర్తిగా నమ్మేయలేం లెండి. అందుకే పైన అన్నాను .... యానాంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా మీకు సరైన సమాచారమే తెలిసుంటుంది లెండి .... అని. ఏది ఏమైనా సమతం గారి మరణం కించిత్ మిస్టరీయేనేమో. అనుకుంటాను.

      Delete
    2. //కానీ లేటెస్ట్ ఆధునిక టెక్నాలజీ అయిన 5ఘ్ మీద ఫ్డ్ చేశానని మీ ప్రొఫిలె లో అన్నారు కాబట్టి యువకులే అయ్యుంటారని, వయసు 30-35 మధ్య ఉండచ్చనీ నా అంచనా, ఏమంటారు?//
      అవునండి...మీ అంచనా నిజమే.

      //యానాం విలీనోద్యమం గురించి మీరు చెప్పిన సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే విలీనవ్యతిరేక ప్రముఖుడు, ఆనాటి Acting Mayor అయిన సమతం కిష్టయ్య గారి మరణం గురించి విభిన్న కథనాలు ఉన్నట్లున్నాయి కదా? సాయుధపోలీసులు కాల్చి చంపారంటున్నారు మీరు. కాని మద్దింశెట్టి సత్యానందం (అంతకు ముందు ంఅయొర్) వెనక నుండి పిస్టల్ తో కాల్చాడని Samatam Kistayya అనే వికీ పేజీలో ఉందే? అలాగే Coup d'Etat of Yanaon అనే మరో వికీ పేజీలో జూన్ 13, 1954 న విలీనోద్యమకారులను కొద్దిసేపు ప్రతిఘటించి తర్వాత తప్పించుకునే ప్రయత్నంగా పైడికొండల వారి ఇంటి కాంపౌండ్ గోడ మీద నుండి పడి చనిపోయాడని ఉంది (78 యేర్ ఒల్ద్ మన్).//
      హహా అసలు ఆ samatam kishtaya, coup d'état de yanaon ఆర్టికల్స్ క్రియేట్ చేసి రాసినది నేనే. అప్పట్లో బ్రతికి ఉన్నవాళ్ళని అడిగి తెలుసుకుని రాసాను. ఒక విశ్రాంత ప్రభుత్వోద్యోగి ఐతే తన పెన్షన్ ఆగిపోతుందేమొ అని భయపడి చెప్పను అన్నాడు. తర్వాత రెండుమూడుసార్లు ఆయన్ని కలిసి నా సదుద్దేశం చెప్పిన తర్వాత సరే అని ఆ పూట జరిగినది పూసగుచ్చినట్టు చెప్పాడు. అది ఇంటికొచ్చాక ఒక కాగితంపైన రాసుకున్నను. తర్వాత కనకాలతాతయ్యగారు అప్పట్లో ఎందుకు మద్దింసెట్టితో కలిసి వీలీనానికి మద్దతు పలికారో, సమతం కిష్టయ్య హత్యలో మద్దింసెట్టి సత్యానందానికి ఉన్న సంభదం ఏమితో పూసగుచ్చినట్టు వివరించారు. బొల్లోజు బసవలింగం గారు అప్పటి సంఘటలను వివరిస్తూ టైపు చేసిన ప్రతాలు కాపి ఒకటి నాకు అప్పట్లో దొరికింది. చాలాయేళ్ళు ఇంట్లో భద్రపరిచాను కాని దురద్రుష్తవశాత్తు అవి చెదల పాలు అయ్యింది. ఫ్రెంచి స్థావరాలు అన్నింటిలోను యానాం విలినం అన్నది చాలా సందేహాస్పదమైన కాంట్రవర్షియల్ అంశం. చిత్రం ఏంటంటే అప్పటి మద్దింసెట్టి ఆయన స్వాతంత్ర సమరయోధుడు పట్టా పొంది కూడా తన పిల్లలకి ఫ్రెంచిపౌరసత్వం పోకుండా చూసుకున్నాడు. కనకాల ఆయన చెప్పినదాని ప్రకారం ఆయన మాటల్లొనె "అప్పట్లో ఏదో ఊపు, ఆవేశంతో స్వాతంత్రయం కోసం పోరాడాము...ఏదో పెరు వస్తుంది అనె కాంక్ష తప్ప నిజంగా విలినాం ఎవరికి ఇష్టంలేదు" అని తెలుసుకున్నాను.

      //మీరన్నట్లు కిస్టయ్య గారి మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోదావరిలో పడేసారన్న విశేషం నాకు వికీలో గాని, బొల్లోజు బాబా గారి పుస్తకంలో సదరు పేజిల్లో గాని కనపడలేదు ... స్ధానిక కథేమో?//
      వికిపీడియాలో రాసినవాటికి ఆధారాలు చూపించాలి. అంటే ఎవరో ఒకరు అవి నిజమే అని నిర్ధారించాలి. 70యేళ్ళనాటి గూడుపుఠాని రొంపి లోకి దిగి ఎవరు అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకుంటారు చెప్పండి.

      // కాని మీరన్నట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం వారు సమతం గారిని ఫ్రెంచ్ దేశభక్తుడిగా గుర్తించారట కదా, అంతే గాక పారిస్ లో వారి విగ్రహన్ని పెట్టారనీ వికీలో ఉంది ... ఆ విగ్రహాన్ని మీరు చూసే ఉంటారుగా? //
      ఫ్రెంచివాళ్ళ చత్తసభ తీర్మానం వాళ్ళ అధికారిక గెజెట్టులో ముద్రితమైనది చదివాను. Ordre national du Mérite (సమున్నత జాతీయ శ్రేణి) బిరుదు హోదా అందించినట్టుగా తీర్మానించినట్టు ఉంది. కాని ఆయన విగ్రహం ఎక్కడ ఉందో ఆచూకు దొరకలేదు. కచ్చితంగా ఖాలిసమయాల్లో వివరాలు సేకరిస్తాను.

      //ఇక మరో విషయం నా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను (డూప్లే గురించి ఏదొ క్లుప్తంగా చరిత్ర పుస్తకాల్లో చెప్పినది మినహాయించి భారతదేశంలో ఫ్రెంచ్ పాలకుల సంగతి అంతగా తెలియదు కదా మాకు). బుస్సీ మీకు హీరో అన్నారు మీరు.//
      ద్యూప్లేక్స్ తిరిగివెళ్ళిపోతున్నప్పుడు పాండిచ్చేరి ప్రజలు కన్నీళ్ళతో సాగనపించది ఆనందరంగపిళ్ళై ఉటకించారు. కచ్చితంగా ఫ్రెంచిపాలకులలో అత్యంత పేరుగాంచిన గవర్నర్ ద్యూప్లేక్స్ అందులో సందేహమే లేదు. కాని ఆయన భార్య మతచాందసం వల్ల హిందుదేవాలయను కూలి అక్కడ చర్చి కట్టడం అతని పాలనలోని ఎకైక నల్లమచ్చ. అతడిని ఎంత అభిమానించారొ ఆంగ్లో ఇండియన్ అయిన అతని భార్య ని అంతగా ద్వేసించారు. ఇక బుస్సీదొర గురించి తర్వత బదులు ఇస్తాను. ఇప్పుదు వర్క్ ఫ్రం హోంలో ఉన్నా.

      Delete
    3. // “ హహా అసలు ఆ samatam kishtaya, coup d'état de yanaon ఆర్టికల్స్ క్రియేట్ చేసి రాసినది నేనే. “ //

      మీరు రచించిన వాటి గురించి మీకే చెప్పబోయానన్నమాట, బాగుంది. touche 😁😁
      ————————-
      // “ చిత్రం ఏంటంటే ... మద్దింసెట్టి .... తన పిల్లలకి ఫ్రెంచిపౌరసత్వం పోకుండా చూసుకున్నాడు“ //

      హా హా, దేనికదే 😁.
      చిత్రం ఏం లేదు భారత రాజకీయ నాయకుల లక్షణాలు అబ్బాయన్నమాట 🙂.
      ——————————
      // “ .... కనకాల ...... ఏదో పెరు వస్తుంది అనె కాంక్ష తప్ప ...” //

      కొంత ఆ ఊపు ఉండుండచ్చు, కాదనలేం. కానీ విమోచనం అయిన తరువాత యానాంలో ఏవో మంత్రి పదవులు కూడా వరించినట్లున్నాయిగా ఈయనను? సో, ఆ మేరకు లాభపడ్డాడు కదా?
      ——————————-
      తతిమ్మా వివరాలు మీకు వీలున్నప్పుడే ఇవ్వండి.

      Delete
    4. \\మీరు రచించిన వాటి గురించి మీకే చెప్పబోయానన్నమాట, బాగుంది. తౌచె 😁😁\\
      మా చరిత్రపట్ల మీ ఉత్సుకతకి చాలా సంతోషమండి. కాకపోతే యానాం విలీనం, ఆనాటి పొలీస్ చర్య, సమతం కిష్టయ మరణం, అందులో మద్దించెట్టి ఆయన పాత్ర ఇవన్ని చాలా సందేహాస్పదాలు. జరిగినదానిని మనం మార్చలేము. "న బ్రూయాత్ సత్యమప్రియం" అని ఆర్యోక్తి (ఎదుటవారిని బాధపేట్టే నిజం చెప్పకపోడమే మేలు).

      \\హా హా, దేనికదే 😁.
      చిత్రం ఏం లేదు భారత రాజకీయ నాయకుల లక్షణాలు అబ్బాయన్నమాట\\

      అంటే అప్పట్లో అందరూ నిజాయితీగా పోరాడలేదు, పేరు, లాభాలు చూసుకున్నారు అని అర్ధమయ్యింది. చరిత్రలో మనం చదివేది మొత్తం నిజం కాదు అని కూడ. నేను ఎంతగానో అభిమానించే భారత దేశం అలాంటిచర్యకు ఏలా పూనుకుంది అని ఆశ్చర్యం. బ్రిటీష్ ఇండియా విముక్తి పొందితే అందులోకి ఫ్రెంచి ఇండియాని కలుపుకోవాలి అనుకోడం ఎందుకు? చైనాకు మల్లే బ్రిటీషుపాలనకి మునుపు ఇండియాకి ఫలానా అని ఎమైన సరిహద్దులున్నాయా?? అసలు ఇండియా అంతా ఒకటే అన్న భావన హిందు సంస్కృతిలో ఉంది. వాళ్ళ దృష్టిలో ఇది భరతవర్షము, వేదభూమి, పుణ్యభూమి. కాని బ్రిటీష్ ఇండియా విముక్తిపొందినప్పుడు హిందురాష్ట్రంగా ఆవిర్భవించలేదు. ఒక లౌకిక రాజ్యంగా ఏర్పడింది. అప్పుడు ఫ్రెంచి ఇండియా తమలో కలవాలి అని కోరుకోడం ఎంతవరుకు సమంజసం? ఇలాంటి ఫిలసాఫికల్ ప్రశ్నలు నా మదిలో సుడితిరిగాయి

      గతాన్ని చూసి గుణపాఠాలు నేర్చుకోవాలి తప్ప గతంలో జీవించడంలో ఎలాంటి ప్రయోజనం ఒరగదు అని నా పొలిచ్య్.


      \\కొంత ఆ ఊపు ఉండుండచ్చు, కాదనలేం. కానీ విమోచనం అయిన తరువాత యానాంలో ఏవో మంత్రి పదవులు కూడా వరించినట్లున్నాయిగా ఈయనను? సో, ఆ మేరకు లాభపడ్డాడు కదా?\\

      నాకు ఆయన అంటే చాల ఇష్టం, గౌరువం. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాగ లాభపడినవాళ్ళు వేరే ఉన్నారు. పేర్లు చెప్పలేను. సరదాగా ఒక గమ్మత్తు విషయం చెప్పాలని చెప్పాను తప్ప వీటిలోతుల్లోకి వెళ్ళడం నాకు సుతరాము ఇష్టం లేదు. మాది చాలాచిన్నవూరు. నేటివ్స్‌లో ఒకరికొకరికి చాలా మంచి స్నేహ బాంధవ్యాలున్నాయి. అప్పటి మనుషులు ఇప్పుడెవ్వరు బ్రతికిలేరు. ఇలాంటివి చర్చిస్తే సున్నితమైన సంబంధాలు చేడిపొవడం తప్ప మరేమి ఒరగదు.

      అప్పట్లో చదువు, ముందుచూపు ఉన్నవాళ్ళు నోరుమూసుకుని విలీనం అంగీకరించి తమ ఫ్రెంచిపౌరుసత్వం పోకుండా ఫ్రాన్స్ ఇచ్చిన ఐచ్చిక అవకాన్ని వినియోగించుకుని ఫ్రాన్స్తో సంబంధం కొనసగించారు. ఫ్రెంచి పౌరుసత్వం తీసుకున్న అందరు చక్కగ సెట్టిలయ్యారు.

      నాకు చరిత్ర చాలా ఆసక్తి కాబట్టి వివరాలు సేకరించాను అంతే. మా తాతగారు విలీన వ్యతిరేకి అయినప్పటికి ఫ్రెంచి పౌరసత్వం నిలుపుకుంటే యానాం నుండి గెంటేస్తారేమొ అని...అప్పుడు తన సనాతనధర్మానికి నష్టం వస్తుందని, ఫ్రాన్స్‌లో ఆవుమాంసం తినడం, క్రైస్తవ మతంలోకి మారడం లాంటివుంటాయని భయపడీ చివరికి పౌరుసత్వం వదిలేసుకున్నారు.

      నాకు ఫ్రాన్స్ అంటే చాలా అభిమానం కాబట్టి....ఇప్పటి ఫ్రాన్స్‌లో నా శాఖాహార నియమానికి, హిందుధర్మం పాటించడానికి ఇబ్బంది లేదు అని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కొన్నేళ్ళ క్రితమే గ్రీంకార్డు లాగ వచ్చింది. ఇక్కడే నా యం.ఎస్, పి.హెచ్‌డి, పోష్టు డాక్టరేటు చేసాను.

      Delete
    5. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంకండి. ఎప్పుడైన వాట్సాప్ప్ లాంటివాటిలో ముచ్చటించుకుందాము. ఇక్కడ మనం చెప్పే కామెంట్స్ అన్ని రికార్డ్ అవుతాయి. వాళ్ళ సంతతి ఎవరైన ఒకవేళ చదివితే నొచ్చుకుంటారు. ఈ కారణంగనే నేను ఉత్తరోత్తరా వికిపీడియాలో ఆ అంశంపైన మరింత లోతుగా వెళ్ళలేదు.

      మావూరి వెంకన్నబాబు, రాజరాజేశ్వరుడి కల్యాణోత్సవం గురించి విన్నారా? వాటిమీద నేను సేకరించిన విషయాలతో ఆర్టికల్స్ రాశాను. అందులో ప్రతిరోజు వాహనం ఉత్సవదారులు యానాంలో పూర్వీకుల కుటుంబాలవాళ్ళు. మా వెంకన్నబాబుని చద్దికూటివెంకన్న, మీసాల వెంకన్న అంటారు. (అదేంటో ఇక్కడెవ్వరు ఆయన్ని వెంకటేశ్వరుడు అని పిలవరు). 1930s అప్పటి శాసనం ఒకటి మొన్నటి వరుకు ఉండేది. గుడివిశాలం చేయాలని మొత్తం కూల్చేసి పునర్నిర్మాణం చేపట్టారు. మరి ఆ శాసనం భద్రపరిచారో లేదో తెలియదు.

      https://en.wikipedia.org/wiki/Yanam_Venkanna_Babu_Kaly%C4%81%E1%B9%87%C5%8Dtsavam

      https://en.wikipedia.org/wiki/Yanam_%C5%9Ar%C4%AB_R%C4%81jar%C4%81je%C5%9Bwara_Kaly%C4%81%E1%B9%87%C5%8Dtsavam

      Delete
  16. చైతన్య గారూ, మీ టపాకు పెద్దగా సంబంధం లేని ప్రశ్న. మీకు తెలిస్తే కుదిరినప్పుడు సమాధానం చెప్పగలరు.

    విలీనం పిదప ఫ్రాన్సుకు వలసపోయిన పాండిచ్చేరి వాస్తవ్యులు సింహభాగం పారిస్ ఉత్తర రైల్ స్టేషన్ (gare du nord)-లా షాపెలు మెట్రో మధ్య ఉంటారు. యానామీయులు కూడా కూడా ఇదే ప్రాంతమా లేదా వేరే అడ్డా ఉందా? ఆ దారిలో ఎన్ని సార్లు వెళ్లినా తెలుగు వినిపించలేదు కాబట్టే అడుగుతున్నా.

    No hurry, at your leisure please.

    ReplyDelete
    Replies
    1. //విలీనం పిదప ఫ్రాన్సుకు వలసపోయిన పాండిచ్చేరి వాస్తవ్యులు సింహభాగం పారిస్ ఉత్తర రైల్ స్టేషన్ (gare du nord)-లా షాపెలు మెట్రో మధ్య ఉంటారు. యానామీయులు కూడా కూడా ఇదే ప్రాంతమా లేదా వేరే అడ్డా ఉందా? ఆ దారిలో ఎన్ని సార్లు వెళ్లినా తెలుగు వినిపించలేదు కాబట్టే అడుగుతున్నా.//

      గార్ ద్యు నోర్ లో అనేకాదండి. పాండిచ్చేరి నేటివ్‌స్ అన్నిచోట్ల స్థిరపడ్డారు. కాకపోతే అక్కడ పాండిచ్చేరి, శ్రీలంక తమిళుల వ్యాపారాలు చాలా ఉన్నాయి. చెప్పాలంటే అక్కడ అఫ్రికన్స్, అరబ్స్ ఎక్కువ. ఇక్కడ ఒక్క తెలుగు రెష్టారెంట్ కూడా నాకు తారసపడలేదు యానాంవాళ్ళు పారిస్ ఉన్న రాష్ట్రంలో సుబర్బ్స్‌లో ఉన్నారు. పెద్ద గుంపుగా troyes (త్రొవా) అనేచోట ఉన్నారని విన్నను. ఆ ఏరియాని petit yanaon (చిన్న యానాం) అని పిలుస్తారుట. ఇక్కడ యానాంవాళ్ళతో అడపాదడపా కలుస్తుంటాను కాని నాకు ఇండియన్స్ కంటే ఫ్రెంచి, ఐరోపా, అరబ్ స్నేహితులతో సాన్నిహిత్యం ఎక్కువ.

      Delete
    2. థాంక్సండీ. తూర్పు స్టేషన్ దగ్గరలో భారతీయ భోజనాలు & ఉత్తర స్టేషన్ దక్షిణాది తిండి వల్లనే ఏండ్ల తరబడి పారిస్ ధైర్యంగా తిరగ్గలిగాను. అత్యంత చౌకగా కడుపు నిండా సుష్టుగా తిన్నాక అన్నదాతా అనాలని సుఖీభవ అనిపించేది, తమిళం సరిగ్గా రాదు కనుక మానేసా. గత కొన్ని ఏళ్లలో ES/TGV ఎక్కే ముందు శరవణ భవన్ (పది పన్నెండేండ్ల కిందట లేదు) పార్సెల్ తీసుకోవడం అలవాటు అయింది.

      ఐరోపా కస్టమర్లను సహోద్యోగులకు బదిలీ చేసి ఐదేండ్లయింది. ఈ సారి (కొరోనా అధ్యాయం ముగిసాక) petit Yanaon కోసమయినా వెళ్తాను.

      Delete
    3. //థాంక్సండీ. తూర్పు స్టేషన్ దగ్గరలో భారతీయ భోజనాలు & ఉత్తర స్టేషన్ దక్షిణాది తిండి వల్లనే ఏండ్ల తరబడి పారిస్ ధైర్యంగా తిరగ్గలిగాను. అత్యంత చౌకగా కడుపు నిండా సుష్టుగా తిన్నాక అన్నదాతా అనాలని సుఖీభవ అనిపించేది, తమిళం సరిగ్గా రాదు కనుక మానేసా. గత కొన్ని ఏళ్లలో ES/TGV ఎక్కే ముందు శరవణ భవన్ (పది పన్నెండేండ్ల కిందట లేదు) పార్సెల్ తీసుకోవడం అలవాటు అయింది.//

      మీరన్నట్టు అక్కడ రెష్టారెంట్స్‌లో తిఫ్ఫిన్స్, భోజనం చవకగానే దొరుకుంది కాని రెండూ మూడు మినహాయిస్తే అంత తక్కినవి అంత రుచికరంగా ఉండవు. శరవణ భవన్, శ్రీ కృష్ణ భవన్, మునియాండి విలాస్ ఇవి మాత్రమే బాగుంటాయి. దగ్గర్లోనే బొంబే రెష్టారెంట్ అని పాకిస్తానివాళ్ళది ఉంది. 5€లకే మంచి ఫుడ్ దొరుకుంది. ఈసారి ఇటువైపు వచ్చినప్పుడూ అస్సలు మిస్స్ అవ్వద్దు. వాడు సుమరు 15 యేళ్ళనుండి అదే రేటు కి ఫుడ్ పెదుతున్నాడు. పారిస్ అవుట్‌స్కర్ట్స్ బొబిజ్ఞిలో (బొబిగ్న్య్) పంజాబి రెష్టారెంట్ ఒకటి ఉంది. వాళ్ళు కూడా అదే రేటుకి అంతకన్నా రుచికరమైనవి అందిస్తారు. అక్కడే రెండు గురుద్వారాలున్నాయి.
      వాళ్ళ లంగరులో ఫ్రీ భోజనం దొరుకుతుంది.

      ఇప్పుడు ఇండియన్స్ బాగానే పెరిగారు. మొన్నటివరుకు మాయానాంవాళ్ళే నడిపేవాళ్ళు తెలుగు ఎసోసియేషన్. ఇప్పుదు ఆంధ్రా, తెలంగాణా నుండి యువరక్తం ఎసోసియేషన్ నిర్వహణ బధ్యతలు తీస్కొని చురుకుగా పాల్గోడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగుదనం అంతే యే ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా యావత్ ఆంధ్రా, తెలంగాణా, యానాం సంస్కృతుల మేళవింపుగా ఇప్పటి ఎసోసియేషన్ ముందుకెళ్ళడం చాలా శుభపరిణామం.

      //ఐరోపా కస్టమర్లను సహోద్యోగులకు బదిలీ చేసి ఐదేండ్లయింది. ఈ సారి (కొరోనా అధ్యాయం ముగిసాక) petit Yanaon కోసమయినా వెళ్తాను.//

      జైగారు మీరిప్పుడు యూరోపులో ఉంటున్నారా?

      Delete
    4. చైతన్య గారూ, థాంక్సండీ. ఈసారి వచ్చినప్పుడు తప్పక బాంబే రెస్టారంట్ వెళ్తాను.

      నాకు గురున్న వాటిలో నార్త్ స్టేషన్ నుండి దగ్గరలోనే రోడ్డుకు కుడి వైపు తమిళ హోటల్ (పేరు మద్రాస్ కెఫె అనుకుంటా, just after crossing the bus garage gate, opposite side) బాగుండేది. శరవణ తెరిచాక దాన్నే ఆశ్రయించడం ఆనవాయితీగా పెట్టుకున్నాను.

      నేను హైదరాబాదులోనే ఉంటానండీ. శానా సంవత్సరాలు ఐరోపా కస్టమర్లను కలిసేందుకు ఏడాదికి నాలుగయిదు సార్లు వచ్చి మూడు నాలుగు వారాల తరబడి చక్కర్లు కొట్టేవాడిని. భారతీయ కంపెనీ ఉద్యోగం కాబట్టి మినిమం ఖర్చుతో (actuals basis) గడపాలి, మంచి నీళ్లకు డబ్బులేమిటి అని అకౌంటెంట్ ఒకటే గొణుగుడు! తిండికి డబ్బుకూ మొఖం వాచి "సుందర్ సస్తా ఠికావూ ఖానా" అంటూ వెతుక్కుంటూ ప్రతి ఊర్లో ఇటువంటివి దొరకబట్టా.

      నెమ్మదిగా కొన్నేళ్ళకు ఐరోపాతో బాటు అమెరికా మార్కెట్ కూడా తోడయింది. కాలక్రమాన అమెరికా ఒక్కటే ఫోకస్ చేసి "ప్రయాణ బడలిక" కొంచం తగ్గించుకున్నాను. ఇప్పుడు వేరే బాధ్యతలు పెరగడంతో అది కూడా మాక్సిమం వర్షానికి 30 రోజులు ప్రయాణం.

      ఇవ్వాల్టికి నా పాత శెంగెన్ వీసా ఎక్సపైర్ రెండేళ్లు ఇంగ్లాండ్ వీసా ముగిసి ఏణ్ణర్ధం, మళ్ళీ రెన్యూ చేయలేదు. పోయినేడాది మిత్రులతో బాల్కన్స్ రోడ్డు ట్రిప్ కోసం వీసా అర్జీ పెట్టుకుందామనుకుంటుండగా అమెరికా వెళ్లాల్సి వచ్చి ఎగ్గొట్టా (డ్రైవర్ తగ్గినందుకు వాళ్ళ తిట్లు భరించి మరీ).

      Delete
    5. అవునండి madras cafe ఇప్పటికీ ఉంది. అక్కడ కూడా ఫుడ్ బాగానే ఉంటుంది. నేను ఉండేడి ఈఫిల్ తవర్‌కి పక్కనే కాని ఎప్పుడో నెలారెండునెల్లకి వెళ్తుంటాను. ఈప్పటికి ఫ్రాన్స్‌లో 5 రాష్ట్రాల్లో ఉండి మళ్ళి తిరిగి పారిస్‌కి shift అయ్యాను. పారిస్ బయట మన Indian food దొరకడం దాదాపు శూన్యం. I am more used to French vegetarian food. ఈసారి పారిస్ వచినప్పుడు చెప్పండి కలుద్దాము :)

      Delete
    6. చైతన్య గారూ, ఈ సారి (ఎప్పుడో తెలీదు కానీ) వచ్చినప్పుడు తప్పక కలుస్తాను. చిన్న యానాము చూసినట్టు ఉంటుంది కూడా.

      ఒక కస్టమర్ ఇచ్చిన full course French gourmet dinner వెళ్ళినప్పుడు, యూదు మిత్రుడు ఒకాయన నాకోసం వెజ్ అప్షన్ల ఎన్నిక చేసి పెట్టాడు. అతను చేపలు తినొచ్చు కానీ నా కొరకు అది మానేసి మా ఇద్దరి ఆర్డర్లు తానే చూసుకున్నాడు.

      Full buffet breakfasts are very good for Indian vegetarians. Lunch can be skipped also.

      For dinner I used to rotate between Indian, Italian, Arab/Moroccan, Greek & Chinese cuisines while going around on the continent for higher veg options. I dislike "imitation meat" veg/vegan food & avoid those specialty restaurants.

      USA & UK: no problems at all as Indian food is available much more easily.

      Delete
    7. నైస్ అండి జై గారు. అవును ఇక్కడ మనం వెజ్ అని చెబితే వీలైనంతవరుకు సహకారం అందిస్తారు. అది ఎంతో మెచ్చుకోవాల్సిన విషయం.

      అమెరికాలో నాకు అనిపించింది ఏంటంతే మనవాళ్ళు దాదాపు వాళ్ళలో వాళ్ళే మసులుతుంటారు. అక్కడి అమెరికన్స్తో అవసరానికి మించిన సాన్నిహిత్యం పెట్టుకోరు. అక్కడి నా ఫ్రెండ్స్, చుట్టాలు కూడా ఇదేమాట చెప్పారు. కాని ఇక్కడ అలాగ కుదరదు. మన తిండి, వేషభాషలు ఇక్కడికి తగ్గుటుగా మారాసిందే. దీర్ఘకాలం ఇక్కడ ఉండాలంటే, ఇక్కడివాళ్ళతో కలిసిమెలిసి తిరగకతప్పదు.

      Delete