Monday, April 20, 2020

ఎగిరే పావురమా

ఓ ఎగిరే పావురమా
రివ్వురివ్వుమంటూ
రెక్కలు విదిలించి
ఆకాశమే హద్దుగా
నువు దుసూకుపో

పంజరాన బంధిస్తే
కట్టడిచేయగలిగేది
నీ రెక్కలనే గాని
ఊహలను కాదు

ఎంత ఎగరాలో
ఎక్కడ ఒదగాలో
నీకు నీవే తెలుసుకొని
నిర్ణయించుకోవాలి తప్ప
అవి మరెవరో చెబితే
ఇంకది స్వేచ్చ కాదు బంధనం
ఒదగడం కాదు అణిచివేత

గాయపడి పగిలిన
నీ హృదయశిల్పాన్ని
స్వాలంబన అనే ఉలితో
మరలా చెక్కి చుడు
ఒంపుసొంపులతో హొయలుపోయే
అద్భుత కళాఖండ
మానసప్రతిమ రూపుదిద్దుకుంటుంది
ఆ నైపుణ్యం నీ హృదయాంతరాళాన
పదిలంగా దాగుందని గుర్తుంచుకో

ఓపికనంతా కూడగట్టి ఎగురు
ఓ స్వేచ్చా విహంగమా 
మంచి చెడు తెలుసుకొని
ఎటు పయనిస్తావో 
నీకు నీవే నిర్ణయించుకో

2 comments:

  1. బలవంతం కాదెపుడూ ఫలవంతం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక.... అన్నట్లు, నీ అనుభవం చెప్పే పాఠం విలువ నీకు అర్ధమైనంతగా మరెవరికీ తెలిసే అవకాశం లేదు. చక్కగా అనుష్ఠించబడినదైన పరధర్మము కంటే గుణము లేనిదైననూ స్వధర్మమే మేలు, ఆచరణీయము కూడా. ఓపిక, చిరునవ్వు ఆయుధాలుగా ఇతరులకు, ప్రకృతికీ హాని కలిగించని (విశృంఖలత స్వేచ్ఛ కాదు గనుక) ఏ ఊహ అయినా మంచిని పెం(పం)చడానికి ఉపయోగపడుతుంది.

    మీ కవిత చదివాక నాకనిపించిన మాటలివి చైతన్య గారు.

    ReplyDelete
  2. \\బలవంతం కాదెపుడూ ఫలవంతం.\\
    నిజం చెప్పారు అండి.

    \\నీ అనుభవం చెప్పే పాఠం విలువ నీకు అర్ధమైనంతగా మరెవరికీ తెలిసే అవకాశం లేదు.\\

    అణిచివేత నుండి స్వేచ్చ అని నా ఉద్దేశం. పంజరంలో చిక్కుకొని గాయపడ్డ ఒకానొక పావురం గురించి రాసిన కవిత ఇది.

    \\మీ కవిత చదివాక నాకనిపించిన మాటలివి చైతన్య గారు\\
    కవిత చదివి మీ ఆలోచనలు పంచినందుకు చాలా థ్యాంక్స్ అండి.

    ReplyDelete