నేలను అమ్ముకున్నవాడు
జలతారు పానుపుల పైనెక్కి
మహవిలాసంగా కులుకుతుంటే
నేలను నమ్ముకున్నవాడు మాత్రం బక్కచిక్కి
అప్పులపాలై వీధినపడి అర్రులుచాస్తున్నడు
నేలను అమ్ముకున్నవాడు
బెంజికారులో తిరిగి రాజసాన్ని వెలగబెడుతుంటే
నేలను నమ్ముకున్నవాడు
గంజికి గతిలేక పడరానిపాట్లతో అలమటిస్తున్నడు
అమ్మలాంటి నేలని విభజించి ఆటవెలదిగ నడివీధిలో అమ్ముతుంటే
మరి దక్కేది పెద్దమనిషనే గౌరవం
కన్నకూతురు లాగ కాచి రెక్కలుముక్కలుచేసి పంటలు పండిస్తే
రైతుకి దక్కేది బిచ్చగాడనే అవమానం
- 23/12/2014

No comments:
Post a Comment