హలాన్నిపట్టి పొలాన్ని దున్నుతు
ప్రొద్దుపోయినా సద్దుమణగక
పాటుని సలిపే రైతన్నా
ఈ పూటకి బువ్వేది?
విత్తులు నాటి వానచినుకుకై
పంటమొలకకై అర్రులుచాచి
ఎంతో వేచే రైతన్నా
ఈ రాత్రికి నిద్రేది?
కంటిమీదన కునుకే లేక
దుక్కిదున్నిన పంటనమ్మితె
గిట్టుబాటు గాని రైతన్నా
నీ పాటుకి విలువేది?
అప్పుల ఊబిలో కూరుకుపోయి
ఆదుకొమ్మని వెర్రిగొంతుతో
విచ్చిచూసినా రైతన్నా
నీ మాటకి బదులేది?
ఈసడింపుల ఈదురుగాలిలో
అవమానాల మండుటెండలో
చావుబాటన రైతన్నా
నీ చావుకి పట్టింపేది?
- 15/02/2015
No comments:
Post a Comment