నింగికేసి చూసాను
ఏముంది అంతులేని ఖాళీ తప్ప
నీకేసి చూసాను
ఏముంది చెరగని చిరునవ్వు తప్ప
అమ్మా!
ఏం చెప్పాలి
ఎండకి అడ్డుగా నువ్వు నిలబడితె
ఆ నీడలో వేళ్ళూనుకుని నేను ఎదిగానని చెప్పనా
నీ కంట ఒలికిన కన్నీరు లావాగ్నిలా
నా బండరాతి గుండెని కరిగించేదని చెప్పనా
నీ బుగ్గన చిరునవ్వుల మెరుపులు చూసిన ప్రతిసారి
నా మేని మైమరచి పులకించేదని చెప్పనా
జీవితపు కొలిమిలోని
పెనుసవాళ్ళ నిప్పురవ్వలు
నన్ను కాల్చినప్పుడు
నువ్వున్నావనే ఒక్క ఆలోచన
నాకు ఎంతో ఊరటనిచ్చి
గాయం మానిపేదని చెప్పనా
కళ్ళెదుట లేవుగాని
కనబడుతున్నది నీ రూపమే
సదా నా గుండెగూటిలో
మహారాజ్ఞిలా వెలుగొందు
- 05/06/2015
అమ్మా!
ఏం చెప్పాలి
ఎండకి అడ్డుగా నువ్వు నిలబడితె
ఆ నీడలో వేళ్ళూనుకుని నేను ఎదిగానని చెప్పనా
నీ కంట ఒలికిన కన్నీరు లావాగ్నిలా
నా బండరాతి గుండెని కరిగించేదని చెప్పనా
నీ బుగ్గన చిరునవ్వుల మెరుపులు చూసిన ప్రతిసారి
నా మేని మైమరచి పులకించేదని చెప్పనా
జీవితపు కొలిమిలోని
పెనుసవాళ్ళ నిప్పురవ్వలు
నన్ను కాల్చినప్పుడు
నువ్వున్నావనే ఒక్క ఆలోచన
నాకు ఎంతో ఊరటనిచ్చి
గాయం మానిపేదని చెప్పనా
కళ్ళెదుట లేవుగాని
కనబడుతున్నది నీ రూపమే
సదా నా గుండెగూటిలో
మహారాజ్ఞిలా వెలుగొందు
- 05/06/2015
No comments:
Post a Comment