కొందరి హృదయాలు
కాగితం పువ్వులు
స్పందించలేని మరగుండెలు
ఎడారికొలను కంటే అరుదు
వీరి గుండెల్లో ప్రేమ
కాగితం పూలు కదా
ఎప్పటికి వాడిపోవు
చూడటానికి బాగుంటాయి
కాని చెంతకు చేరి
పీల్చినప్పుడు బయటపడుతుంది
వాటిలో వాసనలేని డొల్లతనం
మొగ్గతొడిగి వికసించి
చుట్టురా అందాన్ని నింపి
కడకు వాడిపోయినా కుడా
సహజపువ్వుల స్థాయిని
కాగితంపూలెప్పుడు చేరుకోలేవు
వీళ్ళకి జీవించడం తెలీక
నటిస్తు కాలం గడిపేస్తారు
నటనలో జీవించచ్చు కాని
జీవితంలో నటించకూడదు
- 16/06/2015
కాగితం పూలు కదా
ఎప్పటికి వాడిపోవు
చూడటానికి బాగుంటాయి
కాని చెంతకు చేరి
పీల్చినప్పుడు బయటపడుతుంది
వాటిలో వాసనలేని డొల్లతనం
మొగ్గతొడిగి వికసించి
చుట్టురా అందాన్ని నింపి
కడకు వాడిపోయినా కుడా
సహజపువ్వుల స్థాయిని
కాగితంపూలెప్పుడు చేరుకోలేవు
వీళ్ళకి జీవించడం తెలీక
నటిస్తు కాలం గడిపేస్తారు
నటనలో జీవించచ్చు కాని
జీవితంలో నటించకూడదు
- 16/06/2015
No comments:
Post a Comment