Monday, May 11, 2020

పిండి నేర్పిన గుణపాఠం

చాలా నెలలు నా దగ్గర గోధుమ పిండి నిల్వ ఉండేది కానీ దాన్ని ఎప్పుడు చూసినా "చపాతీలు అస్సలు చేసుకోను కాబట్టి ఇంత పిండిని నేనేమి చెయ్యాలి? మొత్తం వృధా కదా" అని విసుక్కునేవాడ్ని. కరోనా పుణ్యమాని ఎక్కువ బయటకి వెళ్లలేక ఉన్నదానితో సరిపెట్టుకొనే వింత పరిస్థితి ఏర్పడింది. ఇక చేసేది లేక హతవిధి అనుకుని చపాతీపిండి తీసి చెల్లాయిని అడిగి మొత్తానికి ఒక పూట ఫుడ్ కానిచ్ఛేసాను. ఎందుకో అది సులువు అనిపించి తర్వాత మేథీ పరాఠా, ఆలూ పరాఠా అని చకచకా వండుకోడంతో పిండి దాదాపు అయిపోవచ్చింది. "అరెరె 2కేజిల గోధుమపిండిని అవగొట్టడం నావల్ల కానే కాదు అనుకొన్నాను కానీ వారం తిరగకుండానే అయ్యిపోయిందే!", అని ఆశ్చర్యపోడం నా వంతు అయ్యింది. అప్పుడు, హఠాత్తుగా ఒక ఆలోచన నా మదిలో మెదిలింది.
"దేవుడు మనకి నిర్ణయించే ప్రణాళిక మనం ఈ జన్మలో చేయలేనంత కష్టంగా అనిపించవచ్చు. మన కర్మఫలం తరగని కొండలాగా భయపెట్టవచ్చు....మనం చేరుకోవాల్సిన లక్ష్యానికి ఎన్నో అడ్డంకులు ఎదురుపడవచ్చు. కానీ మన పని, లక్ష్యం, కర్మ.... మనం బద్ధకాన్ని వదిలిపెట్టి మొదలెడితే చాలు. విశ్వాసంతో ముందడుగు వేస్తే ఇవన్ని ఆనతి కాలంలోనే పూర్తిచేయ్యగలము. అది ఏదైనా కావొచ్చు.. అది సఫలం అవ్వడం తథ్యం." అని.
అహా! మనం అహంకారాన్ని పక్కనపెట్టి నేర్చుకోవాలే గాని పిండి కూడా మంచి గుణపాఠం అందించగలదు.

4 comments:

  1. మీలొ మంచి అబ్జర్వర్ ఉన్నారండొయ్, పిండికి,పరమాత్మకి,కర్మకి, పనికి భలే గా చెప్పారు.అంతరంగం నుండి వచ్హిందెపుడూ అక్షర సత్యమే. శ్రీ-ఖమ్మం

    ReplyDelete
  2. థాంక్స్ అండి. ప్రతీ మనిషిలోను ఒక పరిశీలకుడు ఉంటాడేమొ అండి

    ReplyDelete
  3. మీలో కవికి పిండి అనేడి కవితావస్తువు దొరికింది. ఇంకేం భేషుగ్గా ఎన్ని రకాల పని పరోటాలు అయినా ఇలా చేసేస్తారు.👌😜

    ReplyDelete
    Replies
    1. హహా. అలాగెమి కాదండి. అది పాఠం నేర్పింది కబట్టి కవిత లాగ రాయలేదు. చదివినందుకు థ్యాంక్స్.

      Delete