Sunday, May 3, 2020

మంచి-చెడు

ఈ సమాజంలో చెడ్డవాళ్ళ పట్ల జాలి ఉన్నంతగా మంచివాళ్ళ పైన మమకారం ఉండదు ఎందుకో...చెడ్డవాళ్ళ నూరుతప్పులను "వాడంతే" అని సహిస్తుంది కాని మంచివాళ్ళు ఒక్క తప్పటడుగు వేస్తే చాలు భూతద్దం పెట్టి మరీ చూపిస్తుంది...
తనకి ఉన్న శక్తి, కాలం, అధికారం, అందం, డబ్బు ఇవన్ని చేజారిపోయిన తర్వాత మేలుకొలుపు వస్తే అది నిజమైన మార్పు ఎలా అవుతుంది... "వృద్ధనారీ పతివ్రతా" అన్న సామెత చందంగా గత్యంతరం లేకమారినట్టు అవుతుంది గాని... ఒకవేళ వాళ్ళకి పూర్వ స్థితి కల్పిస్తే ఇప్పటిలాగనే బుద్ధిగా ఉంటారా? లేక పాతబాట పడతారా? అన్నది కూడా చూడాలి...అప్పుడే ఆ మార్పులో నిజాయితి బయటపడుతుంది..
పుట్టినప్పుడు అందరు మంచివాళ్ళే. అవకాశాలు అన్నీ ఉన్నప్పుడు కూడా చెడుకి ఆకర్షితుడనివాడు గొప్ప. ఒకటి రెండు తప్పులు జరిగినా అవి సరిదిద్దుకుని తనలోని మంచికి మెరుగులు దిద్దేవాడు గొప్ప.
"మంచితోలు" కప్పుకొని అవకాశనికి తగ్గట్టుగా చిలకపలుకులు వల్లించే వారి మాటలెపుడూ తియ్యగానే ఉంటాయి... ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు చెప్పేవాళ్ళ మాటలు నిష్టూరంగా అనిపిస్తాయి...
మూసపోతకి భిన్నంగా ఉన్నతంగా ఉంటే సమాజం భరించలేదు.
అన్ని విధాలా ఉన్నతంగా ఉన్నప్పటికీ అణిగి అణకువతో ఉండడం అవకాశాలు వచ్చినప్పటికి చెక్కు చెదరని స్ధైర్యంతో దేనికి ఆకర్షితుడు కాకపోవడం ఎట్టిపరిస్తితిలోను ధర్మ మార్గాన్ని వదలక పోవడం గొప్ప. తెలియక తప్పులు చేసినా సరిదిద్దుకుని మంచికి మెరుగులు దిద్దుకునే వాడు గొప్పవాడు.
ఇటువంటి వారు లౌకిక జీవితంలో ఓడినట్లు కనిపిస్తారు. కానీ వారి వెనుక రక్షణకవచంలా భగవంతుడుంటాడని తెలుసుకోరు ధర్మోరక్షతి రక్షితః

2 comments:

  1. < అన్ని విధాలా ఉన్నతంగా ఉన్నప్పటికీ అణిగి అణకువతో ఉండడం అవకాశాలు వచ్చినప్పటికి చెక్కు చెదరని స్ధైర్యంతో దేనికి ఆకర్షితుడు కాకపోవడం ఎట్టిపరిస్తితిలోను ధర్మ మార్గాన్ని వదలక పోవడం గొప్ప. తెలియక తప్పులు చేసినా సరిదిద్దుకుని మంచికి మెరుగులు దిద్దుకునే వాడు గొప్పవాడు.ఇటువంటి వారు లౌకిక జీవితంలో ఓడినట్లు కనిపిస్తారు.>

    కానీ వారిని ఆటంకాలను, అవరోధాలను, అవహేళనలను ఎదుర్కుని ముందడుగు వేయించేది వారిలోనే వారికి రక్షణకవచంలా ఉండేది ధర్మం. ధర్మో రక్షతి రక్షిత:.

    సహజంగా సమాజం అనుకరణ లక్షణం ఎక్కువగా కలిగి ఉంటుంది. ధర్మానికీ, అధర్మానికీ జరిగే పోరులో ధర్మం గెలుస్తుందన్న నమ్మకం కలిగినపుడు మాత్రం ధర్మం వైపు మళ్ళుతారు. ఈలోగా అధర్మంతో పోరాడే శక్తికలిగిన వీరులు మాత్రమే యుద్ధం కొనసాగిస్తుంటారు.

    ReplyDelete
    Replies
    1. //సహజంగా సమాజం అనుకరణ లక్షణం ఎక్కువగా కలిగి ఉంటుంది. ధర్మానికీ, అధర్మానికీ జరిగే పోరులో ధర్మం గెలుస్తుందన్న నమ్మకం కలిగినపుడు మాత్రం ధర్మం వైపు మళ్ళుతారు. ఈలోగా అధర్మంతో పోరాడే శక్తికలిగిన వీరులు మాత్రమే యుద్ధం కొనసాగిస్తుంటారు.//

      నిజమే. చాలా బాగా చెప్పారండి.

      Delete