ఆడదాని మనసు
అచ్చంగా నెమలిపురి
సంకుచిత గోడల నడుమ బంధిస్తే
అప్పుడామె అశోకవనంలో సీత
కఠినదూషణాల కారుయెండ ధాటికి
ఆమె హృదయం వాడిపోయే కుసుమం
పురుషాహంకారవిల్లునుండి సంధించే ఆజ్ఞల శరపరంపరలు
ఆమె అణుకువ రూపంలో విజయాన్ని తెచ్చిపెడతాయనుకుంటే పొరబాటే
నిజానికి అణిగిపోయేది ఆమె అస్తిత్వం, పగిలిపోయేది గాజుగుండె
ప్రేమామృతధారావర్షాన్ని కుంభవృష్టిలా కురిపించి చూడు
అప్పుడామె కారువానకి పులకించి పురివిప్పి ఆడే నెమలి
ఆ వానలో నీ కళ్లలో పేరుకుపోయిన అహంకార పొరలు తొలగిపోతె
భావోద్దీపితానందంలో పురివిప్పి నాట్యంచేసే నెమలిలాగనిపిస్తుంది ఆడది
వికసిత భామాకలాప సౌందర్యాన్ని చవిచూడనివాడు మర్త్యుడె
- 02/02/2015
సూచన: కలాపము అంటే చాలా అర్థాలున్నాయి. అందులో నెమలిపురి అని ఒక అర్థము (మహాభారతంలో అలాగ వాడబడింది). వికసిత భామాకలాపము అన్నచోట నెమలిపురి లాగనే ఆడదాని మనసు వికాసమొందినప్పుడు కనబడే అందము అని నా భావన. అని నా భావన.
No comments:
Post a Comment