సంఘంలో జరిగినవన్నీ గమనిస్తూ, కళ్ళూ చెవులూ పనిచేస్తున్నా
కనిపించనట్లు వినిపించట్లు ఉండే ఓ కవీ! నీ హృదయం మాత్రం కరగడం లేదు
కాయకష్టము చేసినా కడుపుమంట చల్లారడం లేదు
ఆర్తనాదాలు వెలువడుతున్నా ఆదుకునే వారే లేరు
రెక్కలు ముక్కలు చేసుకున్నా డొక్కలెండిపొతున్నా
ఓ కవీ! నీ హృదయం మాత్రం కరగడం లేదు
శ్రమదోపిడియే ఆదాయం మధ్యవర్తుల సముదాయం
ధనదాహం అధికారమోహం అసంబద్ధ ప్రలాపం
బీడువారిన బ్రతుకుల స్థితి మరింత హీనమవుతున్నా
ఓ కవీ! నీ హృదయం మాత్రం కరగడం లేదు
కులమతాల వైషమ్యం వ్యక్తి వ్యక్తికీ మధ్య అగాధం
మతం మత్తులో మొరగడం ఆమాయక ప్రజలను కరవడం
ఇవన్నీ పసి హృదయాలను పాషాణాలుగా మారుస్తున్నా
ఓ కవీ! నీ హృదయం మాత్రం కరగడం లేదు
ప్రాంతాభిమానం భాషాభిమానం వికృత దిశలో పయనిస్తుంటే
విదేశీ వ్యామొహ విషమ జ్వాలలు హాహాకారాలు చేస్తుంటే
ఇవన్నీ ప్రగతి పథంలో పయనించాలనుకున్నవారి గుండెల్లో తూటాలై పొడుస్తున్నా
ఓ కవీ! నీ హృదయం మాత్రం కరగడం లేదు
ఈ భయంకర కల్లోల హాలాహలాల మధ్య ఒక అసంకల్పిత ఆశాకిరణం వెలువడింది…
ఆదే...
సమర శంఖారావం... సంగ్రామనికి సంరంభం...
విజయమే దాని లక్ష్యం... విప్లవమే దాని ధ్యేయం...
- 05/07/2006
No comments:
Post a Comment