సర్వప్రాణులయందు ఆత్మ ఇమిడియున్నది అన్నది పరమసత్యం. ఈ దేహం అశాశ్వతమైనది. కాని నా ఈ దేహంలో ఎక్కడో మారుమూలన మహోన్నత దివ్యత్వం దాగి ఉన్నది. పరబ్రహ్మమునకు అభేదం అయినట్టీ ఈ దివ్యత్వమును నేను అనుభవపూర్వకముగా తెలుసుకోగలిగినప్పుడు నాదేహం నశిస్తుంది. కాని...
అప్పుడు మిగిలియున్న ఆ దివ్యత్వపుస్థితిని గూర్చి ఒక్కసారి అలోచన చేసిన, అదే మిగులుతోంది తప్ప నేను అన్నదానికి అస్థిత్వమే లేకుండా పోతోంది. అసలు నేను లేను అంతా అదే ఆ దివ్యత్వమే.
అహా మాయ ఎంత కపటమైనది. ఏ వికారంలేని ఆ ఆత్మకు "అహం" అనే ఆకారాన్నిజోడించి కల్పనతో కూడిన భవసాగరమందు యదార్థముగా అది విలపించునట్లు చేస్తున్నది.
నీవు లేదు నేను లేదు. అంతా ఒక్కటే దివ్యత్వం అదే ఆత్మ. అది ఎన్నిగా కనిపించినా అది ఏకమే. "సత్యమద్వైతం" అన్నది పరమసత్యం.
(Spring 2004)
No comments:
Post a Comment