నాలో నేను ఆలోచనలలో మునిగిపోతున్నాను
నాతో నేను నిరంతరం సంఘర్షిస్తున్నాను
నాకు తెలియని నేనుకై వెదుకులాడుతున్నాను
నాకెరుకపడుతున్న నేనుని చూసి సంభ్రమపడుతున్నాను
ఆలోచనలనే వరద ప్రవాహంలో
నా అహం వడులు తిరుగుతు కొట్టుకుపోతోంది
బయటి ప్రపంచపు చెలియలికట్టని దాటి
అంతర్ముఖంగా సాగుతోంది నా పయనం
జనాలను అర్థంచేసుకోవడం కన్నా
నన్ను నేను తెలుసుకోడం భగీరథయత్నమే
నాపై నేను సలిపే భీకరపోరులో గెలుపొందితే
ఈ లోకాన్ని సగం గెలిచేసినట్టే
ఒకవేళ నేను ఓడిపోతే
మరెన్ని గెలుపు శిఖరాలను అధిరోహించినా ఇక వ్యర్థమే
పట్టు వదిలిపెట్టడం కన్నా
ఎంతమేరకు పట్టుకోవాలో తెలుసుకోడం గెలుపుకి తొలిచిహ్నం
- 23/01/2015
No comments:
Post a Comment